Friday, October 3, 2025
ePaper
Homeజాతీయందేశంలో ఎలక్ట్రిక్‌ మొబిలిటీ విస్తరణకు చర్యలు

దేశంలో ఎలక్ట్రిక్‌ మొబిలిటీ విస్తరణకు చర్యలు

  • జీవ ఇంధనాల అభివృద్ధిపై భారతదేశం దృష్టి
  • భారత్‌ మొబిలిటీ ఎక్స్‌ పో 2025’ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ

దేశంలో ఎలక్ట్రిక్‌ మొబిలిటీ విస్తరణకు ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గ్రీన్‌ టెక్నాలజీ, ఈవీలు, హైడ్రోజన్‌ ఇంధనం, జీవ ఇంధనాల అభివృద్ధిపై భారతదేశం దృష్టిసారిస్తోందన్నారు. దిగ్గజ వ్యాపారవేత్తలు రతన్‌ టాటా, ఒసాము సుజుకీ భారతదేశ ఆటో రంగం వృద్ధికి.. మధ్యతరగతి ప్రజల కలను నెరవేర్చడానికి ఎంతో సహకారం అందించారని అన్నారు. భారత్‌ పెట్టుబడులకు స్వర్గధామమని.. మొబిలిటీ రంగంలో తమ భవిష్యత్తును రూపొందించుకోవాలని చూస్తున్న ప్రతీ పెట్టుబడిదారుడికి భారతదేశం అత్యుత్తమ గమ్యస్థానంగా నిలుస్తుందని అన్నారు.

PM visits an exhibition at the Bharat Mobility Global Expo 2025 at Bharat Mandapam, in New Delhi on January 17, 2025.

’భారత్‌ మొబిలిటీ ఎక్స్‌ పో 2025’ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. పెరుగుతున్న మధ్యతరగతి, వేగవంతమైన పట్టణీకరణ, సరసమైన వాహనాలు భారతదేశంలో ఆటో రంగాన్ని ముందుకు తీసుకువెళుతున్నాయని ప్రధాని పేర్కొన్నారు. దాదాపు 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని, వీరు వాహనాలను కొనుగోలు చేయాలనుకుంటున్నారని ప్రధాని మోదీ చెప్పారు. ఈవీలను ప్రోత్సహించడానికి పలు ప్రాంతాల్లో ఛార్జింగ్‌ పాయింట్లను ఏర్పాటుచేశామన్నారు. మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమం దేశంలో ఆటో పరిశ్రమ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందన్నారు. ఈ దశాబ్దం చివరికి ఎలక్టిక్ర్‌ వాహనాల అమ్మకాలు ఎనిమిది రెట్లు పెరుగుతాయని అన్నారు. 5 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఫ్రేమ్‌-2 పథకం కింద రూ.8000 కోట్లకు పైగా సబ్సిడీగా ఇచ్చామని ప్రధాని పేర్కొన్నారు. దీంతో 16 లక్షలకు పైగా ఎలక్టిక్ర్‌ బస్సులు ఏర్పాటుచేశామన్నారు. దిల్లీలోనే 1200 కంటే ఎక్కువ ఎలక్టిక్ర్‌ బస్సులు నడుస్తున్నాయని తెలిపారు. ఒకప్పుడు భారతదేశంలో నాణ్యమైన రోడ్లు లేకపోవడంతో ప్రజలు కార్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపకపోయేవారని ప్రధాని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ పరిస్థితి మారుతుండటంతో కార్లకు డిమాండ్‌ పెరుగుతోందన్నారు. ఏడాదికి దాదాపు 2.5 కోట్ల కార్లు విక్రయమవుతున్నాయని తెలిపారు. దేశ రాజధానిలోని భారత మండపంలో నేడు ప్రారంభమైన ’భారత్‌ మొబిలిటీ ఎక్స్‌ పో.. 22వ తేదీ వరకు జరగనుంది. యశోభూమి, గ్రేటర్‌ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో సెంటర్‌ / మార్ట్‌ వేదికల్లో ఎక్స్‌పో కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News