Mata (మాటా) అంటే ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’(Mana American Telugu Association). ఈ సంఘం రెండో మహాసభ (MahaSabha) 2026 జూన్ 19, 20 తేదీల్లో పెన్సిల్వేనియా రాష్ట్రంలోని గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్‌పో సెంటర్‌లో జరగనుంది. ఈ మేరకు కిక్ఆఫ్ సెలబ్రేషన్(Kickoff Celebration)ను ఇటీవల గొప్పగా నిర్వహించారు. న్యూజెర్సీ(New Jersey)లో జరిగిన ఈ కార్యక్రమంలో అమెరికాలోని తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దాదాపు 12 కోట్ల విరాళాలు, స్పాన్సర్‌షిప్ హామీలు లభించాయి. ఈ సందర్భంగా 2026 మహాసభ ప్రచార వీడియోను, అధికారిక వెబ్‌సైట్(Website)ను ఆవిష్కరించారు. సభకు సంబంధించిన ప్రతినిధుల పేర్లను ప్రకటించారు. మాటా వ్యవస్థాపకులు శ్రీనివాస్ గనగోని, ప్రదీప్ సామల ఈ కార్యవర్గాన్ని పరిచయం చేశారు.
- Advertisement -
