Monday, October 27, 2025
ePaper
Homeనల్లగొండKodada | కోదాడ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం

Kodada | కోదాడ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం

కలెక్టర్ తేజాస్ నంద్ లాల్ పవర్
అమృత్ 2.0 పథకంలో భాగంగా తొలి స్టేక్ హోల్డర్ సమావేశం

అమృత్ 2.0 పథకానికి ఎంపికైన కోదాడ పట్టణ అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ తేజాస్ నంద్ లాల్ పవర్ సూచించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ ఆధ్వర్యంలో మొదటి స్టేక్ హోల్డర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా రోడ్లు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ, నీటిపారుదల, విద్య వంటి మౌలిక సదుపాయాలను సమగ్రంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అర్బన్ డెవలప్మెంట్ ప్లాన్ సక్రమంగా లేకపోతే భవిష్యత్తులో అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.

పురపాలక, ప్రజారోగ్య, రెవెన్యూ, నీటిపారుదల, పంచాయతీ రాజ్, మార్కెటింగ్, రోడ్లు-భవనాలు, అటవీ, పోలీస్, విద్యుత్, విద్య, ఆర్టీసీ, హౌసింగ్ వంటి శాఖల అధికారులు తమ శాఖలకు సంబంధించిన వివరాలను నిర్దిష్ట ప్రొఫార్మాలో నింపి వచ్చే శనివారానికి కోదాడ మున్సిపాలిటీకి అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, డిటిసిపి ప్రాజెక్ట్ డైరెక్టర్ అశ్విని, కోదాడ మున్సిపల్ కమిషనర్ రమాదేవి, ఆర్డిఓ సూర్యనారాయణ, సిపిఓ కిషన్, జిల్లా అటవీ అధికారి సతీష్, ఇండస్ట్రీస్ అధికారి సీతారాం నాయక్, మున్సిపల్ డి.ఇ. సాయి లక్ష్మి, టి.పి.ఓ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News