Wednesday, February 11, 2026
HomeజాతీయంDelhi | ఎర్రకోట వద్ద భారీ పే*ళ్లు

Delhi | ఎర్రకోట వద్ద భారీ పే*ళ్లు

9 మంది మృతి?.. 30 మందికి గాయాలు
మరో 10 మంది పరిస్థితి విషమం
సహాయక చర్యలు ముమ్మరం
లోక్ నాయక్ ఆసుపత్రికి క్షతగాత్రుల తరలింపు
న్యూఢిల్లీలో హైఅలెర్ట్

దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట గేట్ నంబర్ 4 దగ్గర భారీ పే*ళ్లు (Bl*st) చోటుచేసుకున్నాయి. దీంతో 9 మంది మరణించినట్లు సమాచారం అందింది. ఆసుపత్రికి తరలించేలోపే 8 మంది మృత్యువాతపడ్డారు. 30 మంది గాయపడ్డట్లు తెలుస్తోంది. మరో 10 మంది పరిస్థితి విషమం(Serious)గా ఉంది. సిగ్నల్ వైపు నెమ్మదిగా కదులుతున్న ఒక వాహనంలో పే*డు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షి చెప్పాడు. ఈ ఘటనలో ఆత్మాహుతి దళాల ప్రమేయం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -

ఈ స్థాయి పే*డు జరగటం ఆందోళనకరమని పేర్కొన్నారు. ఘటనా స్థలానికి 70 మీటర్ల దూరంలోనే గౌరీ శంకర్ ఆలయం (Gouri Shankar Temple) ఉండటం గమనార్హం. ఇవాళ సోమవారం కావడంతో ఆలయ సందర్శనకు పెద్దఎత్తున జనం వచ్చారు. పే*డు ప్రభావం 100 నుంచి 150 మీటర్ల వరకు ఉంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసుల్లో డ్యూటీ ముగించుకొని ఉద్యోగులు ఇళ్లకు చేరే క్రమంలో భారీ పే*ళ్లు జరగటం ఆందోళన కలిగిస్తోంది.

ఈ ఘటనతో చాందినీ చౌక్, ఎర్రకోట పరిసరాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. బహుశా.. రెండు భారీ పే*ళ్లు జరిగాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2011లో ఢిల్లీ హైకోర్టు దగ్గర పే*ళ్లు జరిగిన 14 ఏళ్ల తర్వాత ఢిల్లీలో మళ్లీ పే*ళ్లు జరగడం ఇదే తొలిసారి. భద్రతా సిబ్బంది ఊహిస్తున్నట్లు సీఎన్జీ (CNG) పే*డు కారణం కాదేమో అనే అంచనాలు నెలకొన్నాయి. ఇది టెర్రరిస్టుల (Terrorists) పనే అయుంటుందని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) ఢిల్లీ పోలీసులతో సమీక్ష జరుపుతున్నారు.

పే*డు ధాటికి సంఘటనా స్థలం బీభత్సంగా మారింది. అమిత్ షాతో ప్రధాని మోడీ మాట్లాడి ఘటన జరిగిన తీరుపై ఆరా తీశారు. దరియా‌గంజ్ నుంచి ఎర్రకోట వరకు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. సాయంత్రం 6 గంటల 55 నిమిషాలకు పే*ళ్లు సంభవించినట్లు ప్రాథమిక సమాచారం అందింది. పే*డుకు కారణాలు ఇంకా తెలియరాలేదు. మెట్రో స్టేషన్ సమీపంలో కారులో పే*ళ్ల ధాటికి భూమి భారీగా కనిపించింది. పే*ళ్ల దెబ్బకు 6 కార్లకు మంటలు వ్యాపించాయి. నాలుగు ఆటో రిక్షాలు, 4 బైకులు దగ్ధమయ్యాయి.

అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఘటనా స్థలానికి అంబులెన్స్, 15 ఫైర్ టెండర్లను (Fire Tenders) తరలించారు. క్షతగాత్రులను లోక్ నాయక్ ఆసుపత్రికి తరలించారు. పే*డు జరిగిన పరిసరాల్లో 15 చోట్ల బారికేడ్లను ఏర్పాటు చేశారు. సీఆర్పీఎఫ్ బలగాలు, ఇతర భద్రతా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితి అదుపు తప్పకుండా చర్యలు చేపట్టారు. మీడియా సహా ఎవరినీ ఆ స్థలానికి అనుమతించట్లేదు. నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు.

ఘటనా స్థలానికి ఢిల్లీ స్పెషల్ సెల్ టీం, క్లూస్ టీంలు, ఫోరెన్సిక్ నిపుణులు చేరుకొని శాంపిల్స్ సేకరిస్తున్నారు. డీజీపీ (DGP) సహా పోలీస్ యంత్రాంగం ఎర్రకోట దగ్గరకు చేరుకుంటోంది. చాందినీ చౌక్ మూసివేసి వ్యాపారులు, ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలను సేకరిస్తున్నారు. షాప్ కీపర్స్‌ను పే*డు జరిగిన ప్రాంతం నుంచి పంపించారు. ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. న్యూఢిల్లీలో హైఅలెర్ట్ ప్రకటించారు. ఉత్తరప్రదేశ్, ముంబై, అయోధ్య రాంమందిర్ దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు.

గత కొంతకాలంగా దేశంలోని జమ్మూకాశ్మీర్, హర్యానా, గుజరాత్‌లతోపాటు ఢిల్లీలో ఉగ్రవాద మూకలు పాగా వేశాయి. స్లీపర్ సెల్స్ కదలికలు చోటుచేసుకుంటున్నాయి. 4 వేల మంది పాకిస్తానీలతో కూడిన ఒక టెలిగ్రామ్ గ్రూప్‌ను పోలీసులు గుర్తించారు. ఢిల్లీ శివారు ప్రాంతం ఫరీదాబాదులో దాదాపు 2560 కిలో గ్రాముల అమ్మోనియం నైట్రేట్, 350 కేజీల ఆర్డీఎక్స్ లాంటి పే*డు పదార్థాలను సీజ్ చేశారు. ఢిల్లీ నుంచి గుజరాత్‌కు భారీ స్థాయిలో రవాణా అవుతున్న పే*డు పదార్థాలను పోలీసులు పట్టుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News