Tuesday, February 10, 2026
HomeజాతీయంMaoists | మావోయిస్టులకు మరో దెబ్బ

Maoists | మావోయిస్టులకు మరో దెబ్బ

  • కీలక నేత రాంధెర్తో పాటు పలువురు లొంగుబాటు

మావోయిస్టులకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. సోమవారం ఛత్తీస్ గఢ్ లో 11 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో కీలక నాయకుడు, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు రాంథెర్ కూడా ఉన్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలను కలిపిన ఎంఎంసీ జోన్లో రాంథెర్ కీలకంగా పని చేస్తున్నారు. మావోయిస్టు అగ్రనేత శీఘ్రనేత మిళింద్ తెలుంబే మరణించిన తర్వాత ఎంఎంసీ బాధ్యతలన్నీ రాంథెర్ చూసినట్లు పోలీసులు వెల్లడించారు. తాజాగా లొంగిపోయిన రాంథెర్పై రూ.3 కోట్ల రివార్డు ఉందని పోలీసులు ప్రకటించారు.

రాంథెర్ లొంగుబాటుతో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్టాల్ర సరిహద్దు ప్రాంతాల్లో నక్సల్ క్రియాశీలతను గణనీయంగా తగ్గిస్తుందని భద్రతా వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవలి నెలల్లో వివిధ రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోతుండటం గమనార్హం. మావోయిస్టు నాయకత్వంలో అంతర్గత విభేదాలు, భద్రతాదళాల ఆపరేషన్ల కఠినతరం, ప్రభుత్వ పునరావాస పథకాలు వంటి పరిణామాలు పెద్ద సంఖ్యలో మావోయిస్టుల లొంగుబాటుకు కారణమైనట్లు అధికారులు అభిప్రాయపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News