- ఏళ్లనాటి మంచినీటి సమస్యకు పరిష్కారం.
- మూడు వార్డుల్లో శాశ్వత బోరుబావుల ప్రారంభం.
- హర్షం వ్యక్తం చేసిన కాలనీ వాసులు, గ్రామస్థులు.
అలనాడు ఆ భగీరథుడి తన తప్పసుతో గంగాను దివి నుంచి భువికి తీసుకువస్తే, ఈనాడు చేగూర్ గ్రామ ప్రజల దాహార్తిని తీర్చేందుకు అపర భగీరథుడుగా మారిన సర్పంచ్ మంకాల శ్రీశైలం. తన స్వంత ఖర్చులతో మూడు బోరు బావులను వేయించి, ప్రజల దాహార్తిని తీర్చి ప్రజల మనన్నలను విశేషంగా పొందుతున్నారు.గ్రామంలో ఏళ్ల తరబడి మంచినీటి సమస్యలు వేధిస్తున్నాయి.
ముందు చూపుతో ప్రణాళికాబద్ధంగా ఆలోచన చేసిన సర్పంచ్ మంకాల శ్రీశైలం తన స్వంత ఖర్చులతో మూడు బోరు బావులను తవ్వించి మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు.నందిగామ మండల పరిధిలోని చేగూర్ గ్రామంలో చాలా రోజుల నుంచి మూడు వార్డులో మంచి నీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ విషయం సర్పంచ్ మంకాల శ్రీశైలం దృష్టికి వచ్చింది. ఎలాగైనా శాశ్వత పరిష్కారం చూపాలనే ధ్యేయంతో, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సహకారంతో మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు.

శుక్రవారం గ్రామంలోని 4, 5, 8వ వార్డుల్లో సర్పంచ్, వార్డు సభ్యులతో కలిసి నూతన బోరుబావులను ఘనంగా ప్రారంభించి, పూజలు చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మంకాల శ్రీశైలం మాట్లాడుతూ ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అని, ఆయన సహకారంతో నీటి సమస్యను పరిష్కారం చేశానని తెలిపారు. మొదటగా తన స్వంత ఖర్చులతో మూడు బోరు బావులను తవ్వించానని, ఎమ్మెల్యే సహకారంతో నూతన బోరు మోటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.గ్రామంలో ఎలాంటి సమస్యలున్నా తక్షణమే పరిష్కారం చూపేందుకు తాము ఎల్లప్పుడు సిద్ధంగా ఉన్నమని అన్నారు.
మాపై ఎంతో నమ్మకంతో ఆశీర్వదించిన గ్రామ ప్రజలకు ఎల్లప్పడూ రుణపడి ఉంటామని, గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.మా కాలనిలో ఇలా సమస్య ఉందని చెప్పిన వెంటనే తన స్వంత ఖర్చులతో బోర్లు వేయించి, నీటి మోటర్లను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, ఇలా నీటి సమస్య లేకుండా చేసినందుకు సర్పంచ్, పాలకవర్గానికి కాలనీ వాసులు, గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపి, హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆవులమంద శివ శంకర్,వార్డు సభ్యులు సోలిపేట విగ్నేశ్వరిశ్రీనివాస్ గౌడ్,పబ్బె పూజితప్రవీణ్,కావలి భీమయ్య,గునుగుర్తి రాజశేఖర్,ఖలీద్,కంచనపల్లి భాస్కర్,మాన్క సురేష్, రాయప్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వెంకట్ చారి,ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు పబ్బే సుధాకర్,యువజన విభాగం ఉప అధ్యక్షుడు మంగలి మహేష్,నాయకులు పబ్బె శ్రీశైలం,పబ్బె రవి,గారెల శ్రీను,ఎలికట్టే చంద్రయ్య,మంకాల శ్రీకాంత్,వడ్ల లక్ష్మయ్య, గోస్తి శ్రీకాంత్, భాస్కర్, ప్రవీణ్, రాజు, మల్లయ్య, జంగయ్య, కృష్ణ, వేణు, శ్రీను, గోపాల్, రవి,దొర కృష్ణ మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.
