Wednesday, March 18, 2026
Homeనల్లగొండభాషా అర్థం కావడం లేదనే భావనతోనే ఎమ్మెల్యే సామేల్ వ్యాఖ్యలు

భాషా అర్థం కావడం లేదనే భావనతోనే ఎమ్మెల్యే సామేల్ వ్యాఖ్యలు

  • మత విద్వేషాలు రెచ్చగొట్టాలన్నదే బీజేపీ కుట్ర
  • టీపీపీసీ నాయకులు, అడ్వకేట్ పర్రెపాటి యుగంధర్

బ్రాహ్మణులు చదువుతున్న వేదమంత్రాలు సామాన్య ప్రజలకు సరళమైన భాష లో అర్థం కావడం లేదని భావనతోనే తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ వ్యాఖ్యలు చేశారని,వారిని ఏమాత్రం కించపర్చాలన్న ఉద్దేశం లేదని టీపీపీసీ నాయకులు,అడ్వకేట్ పర్రెపాటి యుగంధర్ అన్నారు. ఒక పార్టీ ఒక మనిషి ఒక వాదంపై మరో ఆలోచన కలిగిన మనిషి తనదైన శైలిలో విమర్శించడం అనేది సర్వసాధారణమైన విషయమని, భారతదేశంలో ఆర్టికల్ 19 (1)(a)),19(2) ప్రకారం రాజ్యాంగం వాక్ స్వాతంత్ర్యపు హక్కు కల్పించిందన్నారు.

ఎమ్మెల్యే సామేల్ వ్యాఖ్యలను తప్పుదారి పట్టించిన బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొట్టాలన్న కుట్రకు పూనుకుందని ఆరోపించారు. రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్ర్యపు హక్కు ఇతర రాజకీయ పక్షాలకు లేకుండా చేయాలనే బీజేపీ కుట్రలను రాష్ట్ర ప్రజలు గమనించాలన్నారు. ఎమ్మెల్యే సామేల్ బ్రాహ్మణులు చదువుతున్న భాషా అర్థం కావడం లేదు అనే భావనను వ్యక్త పరచడంలో జరిగిన వ్యక్తీకరణే తప్ప ఎవరిని ఉద్దేశించింది కాదన్నారు.

- Advertisement -

తాను చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే సామేల్ బ్రాహ్మణ వర్గాల పెద్దలకు వివరణతో క్షమాపణలు చెప్పినా కూడా బీజేపీ వర్గాలు సామెల్ ఇంటిపై దాడులకు దిగడం రాజ్యాంగ వ్యతిరేకమని, బ్రాహ్మణ మేధావులు ఆలోచించాలని కోరారు. బీజేపీ రాజకీయ ప్రయోజనాలకే వాడుకుంటుందే తప్ప ఆ వర్గాలపై ఎలాంటి ప్రేమ లేదన్నారు.ఎమ్మెల్యే సామేల్ చెప్పిన క్షమాపణ లపై ఆలోచన చేసి బ్రాహ్మణులు పెద్దన్న పాత్ర పోషించి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News