8, 9, 10 తరగతుల విద్యార్థులకు
టి-శాట్, ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో నిర్వహణ
కరీంనగర్, నవంబర్ 7 (ఆదాబ్ హైదరాబాద్): బోయినపల్లి (Boinapally) మండలం కొదురుపాక ఉన్నత పాఠశాలలో మండల స్థాయి (Mandal Level) విజ్ఞాన పోటీలు శుక్రవారం జరిగాయి. అన్ని ప్రభుత్వ పాఠశాల నుంచి 8, 9, 10 తరగతుల విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి (MEO) నెలుట్ల శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యా శాఖ (Education Department) ఆదేశానుసరం ఉన్నత పాఠశాల విద్యార్థుల్లో నైపుణ్యాలను (Skills) వెలికితీయడం కోసం ఈ ట్యాలెంట్ (Talent) పోటీలు నిర్వహించామని తెలిపారు. ఎలొక్సూషన్ (Elocution) పోటీలో మొదటి విజేతగా విలాసాగర్ హైస్కూల్ 10వ తరగతి విద్యార్థిని హారిక, రెండో విజేతగా కొదురుపాక హైస్కూల్ 9వ తరగతి స్టూడెంట్ శ్రీవర్ష, మూడో విజేతగా నర్సింగాపూర్ హైస్కూల్ 10వ తరగతి విద్యార్థిని రోహిణి, క్విజ్ (Quiz) వ్యక్తిగత పోటీలో మొదటి విజేతగా నర్సింగాపూర్ హైస్కూల్ 10వ తరగతి విద్యార్థిని డి.రోహిణి, రెండో విజేతగా మల్లాపూర్ హైస్కూల్ 10వ తరగతి విద్యార్థిని కె.అక్షిత, గ్రూప్ క్విజ్ పోటీలో కొదురుపాక హైస్కూల్ విద్యార్థులు మొదటి విజేతలుగా, మల్లాపూర్ హైస్కూల్ విద్యార్థులు రెండో విజేతలుగా నిలిచారు. వ్యాస రచన పోటీలు కూడా నిర్వహించారు. మండల స్థాయి విజేతలు జిల్లా స్థాయిలో పాల్గొంటారని శ్రావణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, బి.ఉషారాణి, రాములు, సీనియర్ టీచర్స్ దుర్గారెడ్డి, నర్సయ్య, మోహనకృష్ణ పాల్గొన్నారు.
