Tuesday, October 28, 2025
ePaper
Homeతెలంగాణఎస్సీ వర్గీకరణలో చంద్రబాబుది కీలకపాత్ర

ఎస్సీ వర్గీకరణలో చంద్రబాబుది కీలకపాత్ర

ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానంపై స్పందించిన మందకృష్ణ

ఎస్సీ వర్గీకరణపై ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేయడం చారిత్రక విజయమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఎస్సీ వర్గీకరణ ఏకగ్రీవ తీర్మానంలో చంద్రబాబుదే కీలక పాత్ర పోషించార‌న్నారు. 1997-98లో తొలిసారి తీర్మానం ప్రవేశపెట్టిన ఘనత చంద్రబాబుదేనన్నారు. ఈ విజయం 30 ఏళ్ల పోరాటంలో అమరులైన వారికి అంకితం చేస్తున్నట్లు చెప్పారు. 1996లో మహాసభకు వచ్చి ఎస్సీ వర్గీకరణకు తొలిసారి హామీ ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణ కోసం చంద్రబాబు చిత్తశుద్ధితో కృషి చేశారు. చంద్రబాబు తల్లి ఆశీస్సులు తీసుకొని 1997లో పాదయాత్ర ప్రారంభించా. మోడీ, అమిత్‌ షా, వెంకయ్య, కిషన్‌ రెడ్డి.. మాకు అండగా నిలిచారు. మాదిగల ఉద్యమాన్ని గుర్తుచేస్తూ పవన్‌ కల్యాణ్‌ కూడా మద్దతు ఇచ్చారు. మా ఉద్యమంలో న్యాయం ఉందనేందుకు ఏకగ్రీవ తీర్మానాలే నిదర్శనం. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా చంద్రబాబు న్యాయం వైపే నిలబడ్డారు. ఇచ్చిన మాట కోసం ఆయన అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News