- మల్లె పూల శ్రీకాంత్ యాదవ్
జవహర్ నగర్‌లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా ఎన్నికైన మల్లెపూల శ్రీకాంత్ యాదవ్‌కు స్థానికంగా ఘన స్వాగతం లభించింది. సోమవారం మాజీ ప్రజాప్రతినిధులు, పలు కాలనీవాసులు, కుల సంఘాల నాయకులు ఆయనను కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఇందిరమ్మ పాలనలో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండే విధంగా ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో ఆదరణ రోజురోజుకు పెరుగుతోందని పేర్కొన్నారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లను అందజేయడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. జిల్లా అధికార ప్రతినిధిగా ఎన్నికైనందుకు తనపై మరింత బాధ్యత పెరిగిందని, పార్టీ ప్రతిష్టను మరింతగా పెంచేందుకు కృషి చేస్తానని చెప్పారు. అనంతరం పలువురు నాయకులు, కాలనీ అసోసియేషన్ కమిటీ సభ్యులు శ్రీకాంత్ యాదవ్‌కు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, కుల సంఘాల ప్రతినిధులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
