Tuesday, March 31, 2026
Homeరంగారెడ్డిమల్కాజ్గిరి కమిషనరేట్లో పలువురు పోలీస్ అధికారుల పదవి విరమణ..!

మల్కాజ్గిరి కమిషనరేట్లో పలువురు పోలీస్ అధికారుల పదవి విరమణ..!

  • వారి సేవలను కొనియాడి సత్కరించిన మల్కాజ్గిరి సిపి!!

మంగళ వారం మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ లో పనిచేస్తున్న ఏడుగురు పోలీస్ అధికారులను పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సిపి వారికి సన్మానం చేసారు. పదవి విరమణ చేసిన వారిలో కె. కరుణాకర్ రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్, ఘట్కేసర్ పీఎస్, ఆర్మ్డ్ హెడ్ క్వార్టర్ లో పెనిచేస్తున్న పి. సత్యనారాయణ చారి, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ల ఎన్. జైరాం, వై. సాయిబాబా, ఏ .మూర్తుజా మరియు హోమ్ గార్డ్ ఆఫీసర్స్ కె. పద్మా రావు, బి.బాలనర్సమ్మలు పదవి విరమణ పొందినారు. మల్కాజ్గిరి సీపీ అవినాష్ మహంతి మాట్లాడుతూ..

పోలీసు ఉద్యోగం ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని, విధి నిర్వహణలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఎంతో కాలం పాటు పోలీసుశాఖలో సమర్థవంతంగా, క్రమశిక్షణతో పనిచేసి తమ సేవలు అందించినందుకు ఈ సందర్భంగా వారిని అభినందించారు. పదవీ విరమణ అనంతరం విశ్రాంత జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని, ఆరోగ్యం పట్ల అధిక శ్రద్ధ చూపాలని, పెన్షన్, ఇతర ఆర్థిక అంశాల పట్ల క్రమశిక్షణ పాటించాలని సూచించారు.

- Advertisement -

వారికి రావాల్సిన అన్ని రకాల ప్రయోజనాలు త్వరగా వచ్చే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డీసీపీ అడ్మిన్ ఇందిర, చీఫ్ ఎకౌంట్స్ ఆఫీసర్ శ్రీనివాస్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు సిహెచ్. భద్రా రెడ్డి, కో ఆపరేటివ్ డైరెక్టర్ సువర్ణ, వల రాజు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News