- స్థానికులు అడ్డుకోవడంతో తప్పిన ప్రమాదం..
మల్కాజిగిరిలోని కొంతమంది అధికారులు తన డివిజన్ అభివృద్ధిని పట్టించుకోవడంలేదని గురువారం మల్కాజిగిరి డివిజన్ బిజెపి కార్పొరేటర్ శ్రావణ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే మల్కాజ్గిరి నియోజకవర్గం, మల్కాజ్గిరి డివిజన్ పరిధిలోని సఫిల్ గూడ, బండ చెరువు తదితర మల్కాజిగిరి చెరువులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఖర్చుపెటి చెరువులో మురికి నీరు రాకుండా చూడాలని, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసి ద్వారా బండ్ రిపేర్, గుర్రపు డెక్క తీసివేత తదితర పనులను పూర్తి చెయ్యాలని ఎన్ని సార్లు అధికారులను కోరిన నత్త నడకన పనులు చేస్తుందండటం పై మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ మనస్థాపానికి గురి అయ్యాయి, అధికారుల తీరుని నిరసిస్తూ గురువారం సఫిల్గుడా చెరువులో దూకి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు.
అక్కడే ఉన్న స్థానికులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. సదరు విషయంపై కార్పొరేటర్ శ్రావణ్ తెలిపిన వివరాల ప్రకారం మల్కాజిగిరిలో పదే పదే అధికారులు ఎమ్మెల్యే , కార్పొరేటర్ శ్రవణ్ తో పని చేస్తుండటంతో తమపై ఒత్తిడి తెస్తుండటంతో బయపడుతున్నామాని అధికారులు చెప్పడం సరి కాదన్నారు. పనులు కావట్లేదని అధికారులకు వినతిపత్రలు ఇచ్చిన , శాంతియుతంగా, ధర్నా చేస్తే పోలీసులతో బలవంతంగా ఎత్తుంచి, కేసులు పెట్టడం చేస్తే ఇంక మిగిలింది చెరువులో దూకడమే తమకు శరణ్యమని కార్పొరేటర్ శ్రావణ్ అన్నారు.
అధికారులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా టాయిలెట్స్ రిపేర్ 3 నెలలుగా, మినీ ట్యాంక్ బండ్ పై లైట్స్, వాకింగ్ ట్రాక్, తదితర పనులు ఎందుకు జాప్యం చేస్తున్నారో చెప్పాలని అన్నారు. ఓట్లేసినా ప్రజల నుండి తమకు ఒత్తిడి ఉంటుందని, తమను నమ్మి అధికారం ఇచ్చిన ప్రజలకు జవాబుదారీగా ఉంటూ, ప్రజలకు ఇచ్చిన హామీలను, ప్రజల అవసరాలు తీర్చని పదవి ఉండి ఏం లాభమని కార్పొరేటర్ శ్రావణ్ తన ఆవేదాన్ని వ్యక్తం చేశారు.
