ప్రపంచంలోని ఏడు ఖండాల అత్యున్నత శిఖరాలను అధిరోహించి సెవెన్ సమ్మిట్స్(Seven Summits)ను విజయవంతంగా పూర్తి చేసిన ప్రముఖ పర్వతారోహకురాలు(Mountaineer) మలావత్ పూర్ణ(Malavat Poorna) ప్రతి భారతీయుడికి గర్వకారణమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్(Dharmapuri Arvind) అన్నారు. పూర్ణ తన కోచ్ బి.శేఖర్‌బాబుతో కలిసి హైదరాబాద్‌లోని అర్వింద్ నివాసంలో ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశం పట్ల తాను ఎంతో ఆనందంగా ఉన్నానని ఎంపీ పేర్కొన్నారు.
- Advertisement -

