Tuesday, February 10, 2026
Homeహైదరాబాద్‌Naveen Yadav | నవీన్ యాదవ్‌ను గెలిపించండి

Naveen Yadav | నవీన్ యాదవ్‌ను గెలిపించండి

ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విజ్ఞప్తి
ఎర్రగడ్డ ఏరియా ఇన్‌ఛార్జ్‌గా ఇంటింటి ప్రచారం
ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(JubileeHills Bye Election)లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి (Congress Party Candidate) నవీన్ యాదవ్‌కు ఓటేసి భారీ మెజారిటీ(Majority)తో గెలిపించాలని వేములవాడ ఎమ్మెల్యే(Vemulawada Mla), రాష్ట్ర ప్రభుత్వ విప్ (Government Whip) ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) ఓటర్లను కోరారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రగడ్డ ప్రాంతానికి ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్న ఆయన ఇవాళ ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి చేతి గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి స్థానికులకు వివరించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, బీసీ బిడ్డ నవీన్ యాదవ్‌కి అందరూ మద్దతుగా నిలిచి అఖండ విజయం అందిస్తే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని ప్రగతి బాట పట్టిస్తారని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.

- Advertisement -

యువకుడు, ఉత్సాహవంతుడైన నవీన్ యాదవ్ ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటాడని హామీ ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీల తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని ప్రతిఒక్కరికీ సూచించారు. సెంటిమెంట్‌ కన్నా డెవలప్‌మెంట్ మిన్న అని వివరించారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్ (Koduri Satyanarayana Goud ) కూడా డోర్ టూ డోర్ వెళ్లి ఎన్నికల ప్రచారం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మార్పును ఏవిధంగా అయితే తీసుకొచ్చారో అలాగే జూబ్లీహిల్స్‌లోనూ తీర్పు ఇవ్వాలని ఓటర్లను కోరారు. నవీన్ యాదవ్‌ను గెలిపించటం ద్వారా బీసీ రిజర్వేషన్ల (BC Reservations) ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News