తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో గురువారం కీలక పరిణామం చేసుకుంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్(KTR)కు ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసులు(SIT Notices) ఇచ్చింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లోని సిట్ ఆఫీసులో విచారణకు రావాలని నోటీసులో పేర్కొంది. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి, సిద్దిపేట్ ఎమ్మెల్యే హరీశ్‌రావు(Harish Rao)ను సిట్ సుమారు ఏడున్నర గంటలపాటు విచారణ జరిపిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తుతో సంబంధం ఉన్న సాక్షులను సంప్రదించొద్దని, ప్రభావితం చేయొద్దని సిట్ ఆఫీసర్లు ఆదేశించారు. ఈ కేసులో హరీశ్ రావును త్వరలో మరోసారి విచారణకు పిలవనున్నట్లు కూడా సిట్ ఇప్పటికే ప్రకటించింది. ఫోన్ అక్రమ ట్యాపింగ్ ఆరోపణలపై 2024 మార్చి 10 నుంచి ఈ కేసు దర్యాప్తు జరుగుతోంది. ఇప్పటికే కొందరు నిందితులపై ఛార్జ్‌షీట్ దాఖలైంది. ఇంకా లోతుగా సిట్ దర్యాప్తు చేస్తోంది.
Phone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక మలుపు
- Advertisement -
RELATED ARTICLES
