కేంద్ర మాజీ మంత్రి, రెబల్ స్టార్(Rebel Star) కృష్ణంరాజు(Krishnamraju) 87వ జయంతి(Jayanthi) సందర్భంగా మధిరలో ఉచిత మెగా షుగర్ వ్యాధి చికిత్సా శిబిరం(Free Mega Diabetes Treatment Camp) నిర్వహించారు. యూకే ఇండియా ఫుట్ ఫౌండేషన్(UK India Foot Foundation) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం(Deputy CM) మల్లు భట్టివిక్రమార్క(Mallu Bhattivikramarka) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లను అభినందించారు. లండన్ నుంచి వచ్చిన ప్రముఖ వైద్యులు వేణుతోపాటు ఇండియా, యూకేలకు చెందిన 30 మంది వైద్య నిపుణుల బృందం మధిర నియోజకవర్గ పేదలకు ఖరీదైన వైద్యాన్ని ఫ్రీగా అందించడం గొప్ప విషయమని ప్రశంసించారు.
ముఖ్యంగా డయాబెటిస్ వల్ల కాళ్లకు వచ్చే సమస్యలకు(Diabetic Foot), ఇన్ఫెక్షన్లకు ఈ శిబిరంలో అత్యాధునిక పరీక్షలు చేసి మందులు అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణంరాజు సతీమణి శ్యామల, అమ్మ ఫౌండేషన్ ఛైర్మన్, భట్టి సతీమణి నందిని పాల్గొన్నారు. కృష్ణంరాజుతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధం మరువలేనిదని భట్టి చెప్పారు. ‘కృష్ణంరాజు కుమార్తె ఉప్పలపాటి ప్రసీద, మా కుమారుడు మల్లు సూర్యవిక్రమాదిత్య స్నేహభావంతో కలిసి సేవా దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం నాకు ఎంతో గర్వంగా, ఆనందంగా ఉంది’ అని భట్టి పేర్కొన్నారు.
