Tuesday, October 28, 2025
ePaper
Homeఖమ్మంPonguleti Birthday | జీవించు నూరేళ్లు.. వర్థిల్లు వెయ్యేళ్లు..

Ponguleti Birthday | జీవించు నూరేళ్లు.. వర్థిల్లు వెయ్యేళ్లు..

ఘనంగా ‘పొంగులేటి’ పుట్టిన రోజు వేడుకలు
ఊరూ వాడా మంత్రి శీనన్న జన్మదినోత్సవాలు
బైక్ ర్యాలీలతో హోరెత్తిన ఉమ్మడి ఖమ్మం జిల్లా
రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాల నిర్వహణ
ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఖమ్మం ఎంపీ ఆర్ఆర్ఆర్

వర్థిల్లు వెయ్యేళ్లు…. జీవించు నూరేళ్లు…. తరించే నీవాళ్లు… స్మరిస్తూ అయినోళ్లు … నేలతల్లి గొంతుఎత్తి పల్లెలన్నీ పళవించి తెలిపినాయి నీకూ ఈ క్షణం జన్మదిన శుభాకాంక్షలే (Wishes) అంటూ ఉమ్మడి ఖమ్మం జిల్లా (Khammam District)లోని ఊరువాడ తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి (Minister) పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (శీనన్న) (Ponguleti Srinivas Reddy) జన్మదిన వేడుకల(Birthday Celebrations)ను మంగళవారం అట్టహాసంగా నిర్వహించారు. పొంగులేటి అభిమానులు బైక్ ర్యాలీ(Bike Rally)లతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను హెూరెత్తించారు.

పురవీధులన్నీ శీనన్న కటౌట్లు, ప్లెక్సీలు, భారీ హెర్డింగ్ లతో నిండిపోయాయి. ఉమ్మడి ఖమ్మంజిల్లాలోని ప్రతీ పల్లెల్లో శీనన్న పుట్టిన రోజు వేడుకల కోలాహలమే కనిపించింది. రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలను చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పొంగులేటి శీనన్న పిలుపు మేరకు ఆయన అభిమానులు, కాంగ్రెస్ నేతలంతా సమాజ, సామాజిక కార్యక్రమాల్లోనే నిమగ్నమయ్యారు.

ఖమ్మం, కూసుమంచి క్యాంపు కార్యాలయాల్లో..

మంత్రి పొంగులేటి ఖమ్మం, కూసుమంచి క్యాంపు కార్యాలయాల్లో పుట్టినరోజు సంబురాలు అంబరాన్నంటాయి. ఖమ్మం క్యాంపు కార్యాలయంలో క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కటింగ్, రక్తదాన శిబిరాలను నిర్వహించారు. కూసుమంచి క్యాంపు కార్యాలయంలో క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ భీమిరెడ్డి శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కటింగ్, అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి హాజరై కేక్ కటింగ్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.

ఉమ్మడి ఖమ్మంజిల్లా వ్యాప్తంగా….

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శీనన్న పుట్టిన రోజు సంబురాలను కోలాహలంగా నిర్వహించారు. వరంగల్ క్రాస్ రోడ్డులో వెంపటి రవి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ నిర్వహించారు. మెఫీ మానసిక వికలాంగుల కేంద్రంలో భూక్య సురేష్ నాయక్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. నేలకొండపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

తిరుమలాయపాలెం మండలంలో బెల్లం శ్రీను ఆధ్వర్యంలో శీనన్న జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముదిగొండ మెయిన్ సెంటర్ లో దేవరపల్లి అనంత రెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఎం.వి. పాలెంలో మందపల్లి నాగమణి ఆధ్వర్యంలో శీనన్న జన్మదిన వేడుకలను నిర్వహించారు. గ్రెయిన్ మార్కెట్ ఏరియాలో భీమనాథుల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో, ఖమ్మం ఖానాపురంలో ని శ్రీ అభయ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో అయ్యప్పస్వాములకు డీసీసీ నాయకులు గుర్రాల శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

కాల్వఒడ్డులో అన్న క్యాంటీన్ లో మద్ది కిశోర్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. 60వ డివిజన్ కార్పొరేటర్ బద్దె నిరంజన్ ఆధ్వర్యంలో రామన్నపేటలో కేక్ కటింగ్, అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. ఖమ్మం నగరంలో పారా ఉదయ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి, బాణాసంచాలను కాల్చారు.

మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాథబాబు ఆధ్వర్యంలో వెంకటగిరిలో కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల కేంద్రంలో ఉడుముల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కటింగ్, బైక్ ర్యాలీ కార్యక్రమాలను నిర్వహించారు. సింగరేణి మండలంలో జరిగిన శీనన్న జన్మదిన వేడుకల్లో వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాసు నాయక్ ముఖ్యఅతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు. ఇంకా అనేక ప్రాంతాల్లో శీనన్న జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News