Tuesday, October 28, 2025
ePaper
Homeతెలంగాణలైన్స్ క్లబ్ అఫ్ హైదరాబాద్ ఎవరెస్ట్ సేవా కార్యక్రమం

లైన్స్ క్లబ్ అఫ్ హైదరాబాద్ ఎవరెస్ట్ సేవా కార్యక్రమం

విద్యార్థులకు ఆటవస్తువులు అందజేసిన అధ్యక్షులు లయన్ పి. సుబ్బయ్య

రంగారెడ్డి జిల్లా, మాజీద్‌పూర్‌లోని జెడ్పీహెచ్‌ఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో లైన్స్ క్లబ్ అఫ్ హైదరాబాద్ ఎవరెస్ట్ ఆధ్వ‌ర్యంలో విద్యార్థులకు ఆటవస్తువులు అందజేసింది. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు లయన్ పి. సుబ్బయ్య, కోశాధికారి లయన్ ఎల్. వేణుగోపాల్, జోన్ చైర్మన్ లయన్ ఇ. బుచ్చయ్య పాల్గొన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు కూడా ఈ కార్యక్రమానికి హాజరై ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జోన్ చైర్మన్ బుచ్చయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు లైన్స్ క్లబ్, కలాం ఫౌండేషన్ ద్వారా అవసరమైన సహకారం అందిస్తామని, వారి విద్యా ప్రగతికి ఎల్లప్పుడూ తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News