**బాలికలపై అఘాత్యాలకు పాల్పడిన అటెండర్ యాకూబ్ పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి
**నిందితుడు యాకూబ్ పాషాపై చర్యలకు ఎమ్మెల్సీ మల్క డిమాండ్
హైదరాబాద్.. కరీంనగర్ జిల్లా గంగాధర్ మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో(government school) చోటు చేసుకున్న సంఘటనపై కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ టీచర్స్ బీజేపీ ఎమ్మెల్సీ మల్క కోమరయ్య అసహనం వ్యక్తం చేస్తున్నట్లు పత్రికా ప్రకటన విడుదల చేసారు. పాఠశాలలో అటెండర్ గా పని చేస్తున్న యాకూబ్ పాషా బాలికల బాత్రూంలలో రహస్య కెమెరాలను అమర్చి వారి ప్రైవేట్ వీడియోలను చిత్రీకరించినట్లు, వాటిని అడ్డుపెట్టుకొని బాలికలపై లై0గిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తడం దారుణం అన్నారు. బాలికలపై ఇలాంటి దారుణలకు పాల్పడిన అటెండర్ యాకూబ్ పాషాను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉండి వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించాలి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య కోరారు.
