Thursday, February 26, 2026
Homeవరంగల్‌బాబోయ్… రాత్రి డ్రైవింగ్ లో కళ్ళు లేని కబోదులు అవుతున్నాం!

బాబోయ్… రాత్రి డ్రైవింగ్ లో కళ్ళు లేని కబోదులు అవుతున్నాం!

  • ఏటూరు నాగారం ఏజెన్సీలో నరకంగా మారిన రాత్రి ప్రయాణం!!
  • ప్రమాదాలకు ప్రధాన కారణం వాహనాల “ఎల్ఈడీ లైట్లు”
  • ఇసుక లారీలకు సగం లైట్ స్టిక్కర్ నిబంధన జాడలేదు

ములుగుజిల్లా వ్యాప్తంగా, ముఖ్యంగా ఏటూరునాగారం ఏజెన్సీలో రాత్రి ప్రయాణం ఎంతో అందంగా ఉంటుంది అని ఊహించుకుంటాం.. కానీ వందలాది గా వచ్చే ఇసుక రవాణా భారీ లారీల వల్ల రాత్రి 7గంటల తరువాత అర్ధరాత్రి వరకు ద్విచక్రవాహనంపై లేదా చిన్నపాటి, తేలికపాటి వాహనాలు నడపాలంటేనే నరకప్రాయంగా మారి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయం..భయం గా డ్రైవింగ్ చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ని జానంపేట,రాజుపేట,రమనక్కపేట,వాడగూడెం,చుంచుపల్లి, మల్లూరు, మంగపేట, కమలాపురం, ఏటూరునాగారం, వెంకటాపురం, వాజేడు లాంటి 22 ఇసుక రీచ్ లు నుంచి ఎదురొచ్చే వందలాది ఇసుక లారీల ఎల్.ఐ.డి లైట్స్ వల్ల లైట్ వాహనాలను డ్రైవింగ్ చేస్తున్న వారికి కళ్లు కనిపించకుండ పోతున్నాయి.

ఆ సమయంలో వాహనాలు ఢీకొన్న ఘటనలు చాలా ఉన్నాయి. ఎంత జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తున్నా ఎల్.ఈ.డి లైట్స్ ఫోకస్ వల్ల నడి వయస్సు వారికి, వయస్సు మళ్ళిన వారికి నరకంగా మారింది. ప్రతీ రోజు ఏదో ఒకచోట ఈ రూట్లో ఫోకస్ లైట్స్ వల్ల ప్రమాదాలు చోటుచేసుకుంటు న్నాయి. కొత్తగా వచ్చే వాహనాలు కొత్తగా ఎల్ఈడి లైట్స్ తో వస్తున్నాయి.ఆర్టీవో అధికారుల పర్యవేక్షణ కరువు అవుతుండగా వీటి. నియంత్రణ జాడ ఎక్కడ లేదు. గతం లో వాహనాల హెడ్ లైట్ కు సగం వరకు బ్లాక్ స్టిక్కర్ ఉండాలి అన్న నిబంధన ఉండేది..

- Advertisement -

ఆ రూల్ తీసేసారో ఉందో తెలీదు. ఎల్ఇడి లైట్ ల వలన ఎదురుగా వచ్చే వాహనాలు కనబడక….కళ్ళు మసకబారి ఏమీ కనపడకుండా పోయి. ప్రమాదాలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి, ఇక సంబంధిత అధికారులు వాహనాల హెడ్ లైట్స్ లకు వస్తున్న ఎల్.ఈ.డి గురించి చర్య తీసుకొని కనీసం హెడ్ లైట్ల కు సగం వరకు బ్లాక్ స్టిక్కర్ కానీ, బ్లాక్ పెయింట్ కానీ వేయాలనే రూల్ ను పునరుద్దరించాలని ప్రజలు, ప్రయాణీకులు పెద్ద సంఖ్యలో విజ్ఞప్తి చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News