Tuesday, March 3, 2026
Homeనిజామాబాద్‌Party Change | బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నేతలు

Party Change | బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నేతలు

భీంగల్ పట్టణానికి(Bhimgal Town) చెందిన కాంగ్రెస్ నాయకుడు(Congress Leader), VDC అధ్యక్షుడు నీలం రవి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు షవ్వ అశోక్, కర్నె నరేష్ భారత రాష్ట్ర సమితి(BRS) పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి మాజీ మంత్రి(Former Minister), బాల్కొండ ఎమ్మెల్యే(Balkonda Mla) వేముల ప్రశాంత్ రెడ్డి(Vemula Prashanth Reddy) పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. గత ప్రభుత్వ పదేళ్ల కాలంలో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ (Telangana First CM KCR) నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించిందని చెప్పారు.

ప్రస్తుత సీఎం రేవంత్(CM Revanth Reddy) నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయడంలో నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక విధానాల వల్లే తాము కాంగ్రెస్ పార్టీని వీడి, రాష్ట్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్న BRS పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో BRS మండల పార్టీ అధ్యక్షుడు దొన్కంటి నర్సయ్య, మాజీ జడ్పీటీసి చౌటపల్లి రవి, మాజీ కౌన్సిలర్ బోదిరే నర్సయ్య, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News