భారతీయ జనతా పార్టీ చిలిపిచేడ్ మండల అధ్యక్షులు అజ్జమర్రి నగేష్ ఆధ్వర్యంలో బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ అధ్యక్షతన మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు సమక్షంలో చిలిపిచేడ్ మండల పరిధిలోని గ్రామాలకు చెందిన కాంగ్రెస్,బీఆర్ఎస్ పార్టీలకు చెందిన పలువురు నాయకులు భారీగా ఎంపీ రఘునందన్ రావు చేతుల మీదుగా బీజేపీ కండువా కప్పుకొని బీజేపీ పార్టీలో చేరడం జరిగింది.
బీజేపీ పార్టీలో చేరిన వారు ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్,శివశంకర్ గౌడ్,మధు,మల్లేష్ గౌడ్,బొగ్గుల శీను,చంద్రగౌడ్, నర్సింలు,రమేష్ గౌడ్,బిక్షపతి,భవాని నరసింహులు,మంనే యాదగిరి,బిక్షపతి,పండరి,కూసంగి రమేష్.ఈ కార్యక్రమంలో OBC మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్,జిల్లా ఉపాధ్యక్షులు రాజేందర్,జిల్లా కార్యదర్శి సత్యనారాయణ గౌడ్,మాజీ సర్పంచ్ పాండురంగారెడ్డి,మల్లేశం,అనంతరామ్ గౌడ్ ఉన్నారు.
