Tuesday, October 28, 2025
ePaper
Homeరంగారెడ్డిఅనవసరమైన కేసులు చేయకుండా న్యాయ పరిధిలో పరిశీలించండి

అనవసరమైన కేసులు చేయకుండా న్యాయ పరిధిలో పరిశీలించండి

  • డీజీపీని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి..

ప్రజలపై అనవసరమైన కేసులు నమోదు చేయకుండా న్యాయబద్ధంగా విచారణ జరపాలని మంగళవారం తెలంగాణ రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి , డిజిపి బి. శివధర్ రెడ్డి ఐపీఎస్ ని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా 2025 జూలై 15న అల్వాల్‌లోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన బోనాల పండుగ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో చోటుచేసుకున్న ప్రోటోకాల్ ఉల్లంఘన వివాదం,శాంతి భద్రతా చర్యల పురోగతి, కౌకూర్ ఫార్చ్యూన్ ఎంక్లేవ్ కాలనీ వాసులపై నమోదైన కేసు పునఃపరిశీలన వంటి అంశాలను డిజిపి కు వివరించినట్టు తెలియజేశారు.

అదేవిధంగా ప్రజలపై అనవసరమైన కేసులు నమోదు చేయకుండా, న్యాయబద్ధంగా విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై పోలీసు డిజిపి బి. శివధర్ రెడ్డి సానుకూలంగా స్పందించి, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు ఎమ్మెల్యే తెలియజేశారు.ఈ సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మేకల రాము యాదవ్, జె ఎ సి వెంకన్న , కాలనీ వాసులు గౌతమ్ రాయ్, భుజంగరావు, సత్య, వినోద్, మల్లేష్ , తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News