Tuesday, February 10, 2026
Homeవరంగల్‌Donthi Madhava Reddy | సేవాదళ్ కార్యక్రమానికి శ్రీకారం

Donthi Madhava Reddy | సేవాదళ్ కార్యక్రమానికి శ్రీకారం

మహిళా నేతకు రూ.10 వేల సాయం

నర్సంపేట, నవంబర్ 16 (ఆదాబ్ హైదరాబాద్): నర్సంపేట ఎమ్మెల్యే (Narsampet MLA) దొంతి మాధవ రెడ్డి ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మల్లంపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) మండల నాయకులు సేవాదళ్ (Sevadal) కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మల్లంపల్లికి చెందిన మండల కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు వెండి సక్కుబాయి కళ్ల ఆపరేషన్ (Operation) చేయించుకొని ఇంటి దగ్గర విశ్రాంతి (Rest) తీసుకుంటున్న నేపథ్యంలో దుగ్గొండి మండల పార్టీ అధ్యక్షుడు చుక్క రమేష్ స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి వెళ్లి పరామర్శించారు.

- Advertisement -

కాంగ్రెస్ సేవాదళ్ కార్యక్రమంలో భాగంగా ఆమెకు రూ.10 వేల ఆర్థిక సాయం (Financial Help) చేశారు. ఈ సందర్భంగా చుక్క రమేష్ మాట్లాడుతూ.. కష్టకాలంలో ఉన్న మండలంలోని ప్రతి కార్యకర్తకూ సాయం చేస్తామని చెప్పారు. సేవాదళ్ కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని అన్నారు.

ఈ కార్యక్రమంలో నర్సంపేట ఏఎంసీ డైరెక్టర్ హింగే రామరావు, మాజీ ఎంపీపీ బూరుగు రవీందర్, యూత్ మండల అధ్యక్షుడు కొత్తకొండ రవివర్మ, మాజీ మండల ప్రధాన కార్యదర్శి ఎడెల్లి శ్రీనివాస్ రెడ్డి, మండల ప్రచార కార్యదర్శి కూరతోట సురేష్, బ్లాక్ కాంగ్రెస్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ డ్యాగం శివాజీ, మండల సీనియర్ నాయకులు గన్న ప్రమోద్, దారావత్ రాజు, యార నర్సిరెడ్డి, మట్ట స్వామి యాదవ్, బండారి ప్రకాష్, అకేలి ప్రవీణ్, శంకేసి రమేష్, కానుగుల కుమారస్వామి, కోట నరేష్, కుక్కమూడి రాజు, పొన్నాల మైపాల్, ఇజ్జగిరి నరేష్, మండల కార్యదర్శి జంగిలి రవి, గ్రామ శాఖ అధ్యక్షుడు మహ్మద్ సర్వర్, అల్లాపురం ప్రదీప్, ఇట్టబోయిన ఐలయ్య, ఎన్నారై యశ్వంత్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News