ఈ అంశాలపై పుస్తకం రాసిన బర్ల మహేందర్
అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఆవిష్కరణ
హైదరాబాద్: బర్ల మహేందర్ రాసిన ‘కురుమల సాహిత్యం, చరిత్ర, సంస్కృతి’ (Kurumala literature, history, and culture) పుస్తకాన్ని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ(Dr.B.R.Ambedkar Open University)లో నిర్వహించిన ‘ఛాయ సాహిత్యోత్సవం’(Chaya Sahityotsavam)లో ఆవిష్కరించారు. ఈ పుస్తకం సాంస్కృతిక మూలాలను వెలికి తీసే పరిశోధన గ్రంథమని అంబేడ్కర్ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి (Prof Ghanta Chakrapani) అన్నారు.
వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం (Veeranari Chakali Ailamma Women’s University) ఉపకుపతి ప్రొఫెసర్ సూర్య ధనంజయ్ మాట్లాడుతూ.. ఈ పుస్తకం కురుమల సాంస్కృతిక చరిత్రను ముందుతరాలకు అందించే పరిశోధన గ్రంథమని తెలిపారు. ఆచార్య ఎన్.రజని మాట్లాడుతూ ప్రజలంతా చదవాల్సిన చరిత్ర ఈ పుస్తకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి కె.ఆనందాచారి అధ్యక్షత వహించారు. ఆచార్య పుష్పా చక్రపాణి , అల్లం నారాయణ(Allam Narayana), కె.శ్రీనివాస్(K.Srinivas), సంగిశెట్టి శ్రీనివాస్, బర్ల మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
