వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం జమాల్ పురం గ్రామానికి చెందిన ప్రముఖ సామాజిక సేవా కార్యకర్త, ఉధ్యమకారుడు కుమ్మజెల్ల రాంబాబు, గురువారం మామూనూర్ ఏ.సీ.పీ ఎన్ వెంకటేష్ తో బేటీ జరిపి, వరకట్నంఫై మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, పది సంవత్సరాలుగా ప్రజల్లో తాను కల్పిస్తున్న అవగాహన గురించి తెలిపారు. యూనివర్సిటీ ప్రభుత్వ లా కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో తాను చేస్తున్న జాబ్ వదులుకొని, వరకట్న నిషేధమే లక్ష్యంగా ప్రజల్లో కల్పిస్తున్న అవగాహన, ప్రస్తుతం సమాజంలో నెలకొన్న పరిస్థితులు, తాను చేస్తున్న సామాజిక కార్యక్రమాల గురించి వివరించగా, ఏ.సీ.పీ మనస్ఫూర్తిగా అభినందించడమే కాక, చట్ట పరిధిలో తన పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.
- Advertisement -
