ఫార్ములా-ఈ కార్ కేసు(Formula E-Car Case)లో తనను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ (Governor) అనుమతి (Permition) ఇవ్వటంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ (Brs Party) వర్కింగ్ ప్రెసిడెంట్ (Working President) కేటీఆర్ (Ktr) స్పందించారు. తనను అరెస్ట్ (Arrest) చేసే ధైర్యం ప్రభుత్వం చేయదని చెప్పారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలిపారు. లైడిటెక్టర్ పరీక్షకు సిద్ధమని, ఈ కేసులో ఏమీ లేదనే సంగతి అందరికీ తెలుసని కేటీఆర్ పేర్కొన్నారు.
తాను ఏ తప్పూ చేయలేదని విషయాన్ని ఇప్పటికి వంద సార్లు చెప్పినట్లు వెల్లడించారు. కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కి గవర్నర్ అనుమతి ఇవ్వటంతో తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని పలువురు చెబుతున్నారు. ఒకవేళ అభియోగపత్రాలను కోర్టులో సమర్పిస్తే కేటీఆర్‌ను అదుపులోకి తీసుకునే ఛాన్స్ లేదని, విచారణ న్యాయస్థానంలోనే జరుగుతుందని అంటున్నారు.

