Monday, February 9, 2026
Homeవరంగల్‌KTR | రేవంత్ రెడ్డి పచ్చి మోసగాడు..

KTR | రేవంత్ రెడ్డి పచ్చి మోసగాడు..

  • ఆడపిల్లలకు తులం బంగారం ఇవ్వకుండా పుస్తెలతాడు గుంజుకపోయే దండుపాళ్యం బ్యాచ్….

తెలంగాణ తల్లి విగ్రహంలో నెత్తిపై ఉన్న కిరీటాన్ని బతుకమ్మను దొంగిలించిన రేవంత్ ప్రభుత్వం ఢిల్లీకి పైసలు పంపుడే రేవంత్ ధ్యేయం…. నర్సంపేట ప్రజలు తప్పుడు ఓటు వేసి మోసపోయారు….. తెలంగాణలో జిల్లా కేంద్రం తప్ప ఒక్క నర్సంపేటలోని మెడికల్ కాలేజీ నర్సింగ్ కాలేజ్ ఇచ్చాం…. ఆరు గ్యారెంటీలు అమలు చేయాలేని, యూరియా బస్తా అందివ్వలేని నీచ ప్రభుత్వం మల్లోసారి తప్పు చేయకుండా కారు గుర్తుకు ఓటెయ్యాలి నర్సంపేట మున్సిపాలిటీ రోడ్ షోలో మాజీ మంత్రి కేటీఆర్

రేవతి రెడ్డి పెద్ద పచ్చి మోసగాడు అని కళ్యాణలక్ష్మి లో తులం బంగారం ఇవ్వకుండా ఆడవారి పుస్తెలతాడు ఎత్తుకెళ్లే దండుపాళ్యం బ్యాచ్ స్టువర్టుపురం దొంగల కంటే వీళ్లే పెద్ద దొంగలని మాజీ పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఈ మేరకు నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం సందర్భంగా హెలికాప్టర్లో విచ్చేసిన కేటీఆర్ నర్సంపేట పట్టణంలోని వరంగల్ జంక్షన్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సెంటర్లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, ఆరు గ్యారంటీల అమలులో ఏ ఒక్క పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.

- Advertisement -

మహిళలకు తులం బంగారం ఇవ్వకుండా పుస్తెలతాడు మెడలో నుండి దండుపాలెం బ్యాచ్ అని వీరు సువర్తపురం దొంగల కంటే పెద్ద లంగలు అని అన్నారు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాల నర్సింగ్ కళాశాల ఇచ్చామని కానీ నర్సంపేట జిల్లా కేంద్రం కానప్పటికీ మెడికల్ కళాశాల తో పాటు నర్సింగ్ కాలేజ్ ఇచ్చిన ఘనత బిఆర్ఎస్ పార్టీకి చెందుతుంది అన్నారు.

రెండేళ్ల కిందట నర్సంపేట ప్రజలు తప్పు ఓటు వేసి గోరాతి ఘోరంగా మోసపోయారన్నారు. రైతుల పండించే పంటలకు యూరియా బస్సు అయితే అందివ్వలేని నిసాయస్థితిలో రేవంత్ ప్రభుత్వం ఉందని కేసీఆర్ ఉన్నప్పుడు 100 రూపాయలు ఆటో అన్నకిస్తే పొలం కాడికి బస్తాలు వచ్చేయమన్నారు. మహిళలను మోసం చేయడమే కాకుండా చివరకు తెలంగాణ తల్లి విగ్రహం మీద ఉండే కిరీటాన్ని చేతిలో ఉండే బతుకమ్మను సైతం దొంగిలించాడన్నారు. 11 వ తారీకు జరిగే మున్సిపాలిటీ ఎన్నికల్లో ఒక కారును మాత్రమే చూసి ఓటు గుద్దాలని తద్వారానే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.

డిసెంబర్ నెలలో ఇచ్చే రైతుబంధు పథకం ఫిబ్రవరి 8వ తారీఖు దాటుతున్న రైతుబంధు లేదని తీవ్రంగా విమర్శించారు. ఢిల్లీకి పైసలు పంపుడే రేవంత్ ధ్యేయం అని తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చలేని ప్రభుత్వాన్ని ఘోరంగా దెబ్బతీయాలన్నారు. కాంగ్రెస్ వారు పైసలిస్తే తీసుకొని మిగతా భాకి పైసలు ఇవ్వాలని అడగాలని ఆయన పిలుపునిచ్చారు. 4000 పింఛన్ ప్రతి మహిళకు 2500 రూపాయలు బతుకమ్మ చీరలు రైతుబంధు కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఎటుపోయాయని వీటన్నిటిని ప్రజలు మహిళలు కాంగ్రెస్ వారిని అడిగి ఎక్కడికక్కడ నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, గుండాలకు రౌడీలకు టికెట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ దే అని నన్ను బట్టలిప్పి కొడతామన్నా నాయకుల సంగతి త్వరలో చూస్తామని ఆయన అల్టిమేట్ జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ స్థానిక బిఆర్ఎస్ పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రజలు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News