Friday, October 3, 2025
ePaper
HomeతెలంగాణKTR | రైతులకు అండగా మేమున్నాం...రీజినల్ రింగ్ రోడ్ బాధితులకు కేటీఆర్ హామీ

KTR | రైతులకు అండగా మేమున్నాం…రీజినల్ రింగ్ రోడ్ బాధితులకు కేటీఆర్ హామీ

కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) రీజినల్ రింగ్ రోడ్(RRR) ప్రాజెక్టులో చేసిన అలైన్మెంట్ మార్పుల వల్ల రైతులు దారుణంగా మోసపోతున్నారు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. ప్రభుత్వం దారికి వచ్చే వరకు రైతులంతా ఐక్యంగా ఉండాలని, స్థానిక ఎన్నికలను బైకాట్ చేయాలి అని పిలుపునిచ్చారు.

RRR(Regional ring road) రీ అలైన్మెంట్ వల్ల నష్టపోతున్న నల్గొండ, సూర్యాపేట, గజ్వేల్, సంగారెడ్డి ప్రాంతాల వారు కొందరు సోమవారం తెలంగాణ భవన్‌కు వచ్చి కేటీఆర్‌ను కలిశారు. ఈ మీటింగ్‌లో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన లీడర్లు కూడా ఉన్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ఎలక్షన్స్ ముందు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ… ఉమ్మడి నల్గొండ జిల్లాలో RRR(Regional ring road) వల్ల రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా చూస్తాం అని హామీలు ఇచ్చారు. ఆ మాటలు నమ్మి రైతులు కాంగ్రెస్‌కు ఓటేశారు. కానీ గెలిచాక, అదే పార్టీ వాళ్ళ సొంత లాభాల కోసం రూట్ మార్చేసి రైతులను మోసం చేస్తుంది అని ఆయన విమర్శించారు.

కాంగ్రెస్ లీడర్లు సీట్లు గెలిచాక ప్రజలను వదిలేశారని, కమీషన్లు సంపాదించి ఢిల్లీ లో ఉన్న వాళ్ళ బాసులకు పంపించే బిజీలో ఉన్నారని అని కేటీఆర్(KTR) ఆరోపించారు. వీళ్ళ స్వార్ధం కోసం చేసిన రీ అలైన్మెంట్ వల్ల రైతుల జీవితాలు, జీవనోపాధి నాశనం అవుతుంది అని ఆయన అన్నారు. . దెబ్బతిన్న ఊళ్ళన్నీ కలిసికట్టుగా స్థానిక ఎన్నికలను బైకాట్ చేసి నిరసన వ్యక్తం చెయ్యాలని అన్నారు. అప్పడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పకుండా స్పందిస్తాయి అని అన్నారు.

రైతులకు ఎవ్వరికైనా న్యాయ సలహాలు కావాలంటే తెలంగాణ భావన్ కు రావొచ్చు అని, రైతుల కష్టాలు తీర్చే “జనతా గ్యారేజ్” లా తెలంగాణ భవన్ పని చేస్తుంది అని కేటీఆర్(KTR) అన్నారు. రైతులకు ఎప్పుడు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని హామీ ఇచ్చారు.

బీఆర్ఎస్ అధికారం లో ఉన్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్ లాంటి పెద్ద ప్రాజెక్టులకు భూసేకరణ సమస్యలు వస్తే, నేరుగా రైతులతో మాట్లాడి పరిష్కరించాం అని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఎవ్వరినీ సంప్రదించకుండా ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటుంది అని విమర్శించారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News