- ప్రభుత్వం పై విరుచుకుపడ్డ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- ప్రజాస్వామ్యంలో కక్షపూరిత రాజకీయాలకు చోటు లేదు.
- బీఆర్ఎస్ కార్యకర్త ఉప్పుల మల్లయ్య కుటుంబ సభ్యుల పరామర్శ
- ఆయన వెంట మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు..
రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచ్ స్థాయి ఎన్నికలకే భయపడుతుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు..నూతనకల్ మండలంలోని లింగంపల్లి గ్రామంలో హత్యకు గురైన బీఆర్‌ఎస్ కార్యకర్త ఉప్పుల మల్లయ్య కుటుంబాన్ని కేటీఆర్, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, బెల్లం మల్లయ్య యాదవ్‌లు ఆదివారం పరామర్శించారు.
మల్లయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం, మృతుని కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ..రెండేళ్లలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ళు, రుణమాఫీ తో సహా అనేక సంక్షేమ పథకాలను అమలు చేసినట్లు కాంగ్రెస్ చెబుతోందని… అయినప్పటికీ …ఎందుకు ఎన్నికలకు భయపడుతున్నారని ? ప్రశ్నించారు..పదేళ్లు బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పటికీ, కాంగ్రెస్ పాలనలో కనిపిస్తున్నట్లుగా ఎప్పుడూ దాడులు, దౌర్జన్యాలు చేయలేదని కేటీఆర్ స్పష్టం చేశారు.

రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు..
ప్రజాస్వామ్యంలో కక్షపూరిత రాజకీయాలకు చోటు లేదు. కాంగ్రెస్ నేతలు ఇప్పటికైనా ప్రజల సమస్యలు పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇక బీఆర్‌ఎస్ కార్యకర్తలపై ఇలాగె దాడులు కొనసాగితే, తాము కూడా మౌనం వహించబోమని హెచ్చరించారు. అలాంటి పరిస్థితులు రాష్ట్ర శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశముందని హెచ్చరించారు… సర్పంచ్ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చినందుకు పార్టీ కార్యకర్తలకు కేటీఆర్ శిరస్సువంచి పాదాభివందనం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, బీఆర్‌ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలైన మల్లయ్య యాదవ్, బూడిద బిక్షమయ్య, వెంకట్ రెడ్డి, భూపాల్ రెడ్డి, నరసింహ రెడ్డి, నాయకులు గుజ్జ యుగేందర్ రావు, దయాకర్ రెడ్డి, మండల అధ్యక్షుడు మున్న మల్లయ్య యాదవ్, బత్తుల సాయి గౌడ్ తో పాటు పలు గ్రామాల సర్పంచులు,బీఆర్‌ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
