Thursday, March 26, 2026
HomeతెలంగాణKTR | విధ్వంసం అవసరం లేదు..

KTR | విధ్వంసం అవసరం లేదు..

  • రేవంత్ సర్కార్ పై కేటీఆర్ ధ్వజం.

విధ్వంసం చేయకుండా, ఎవరి ఇళ్లు కూల్చకుండా కూడా అభివృద్ధి, సుందరీకరణ పనులు చేయవచ్చని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మూసీ పరివాహక ప్రాంతంలో ఐదున్నర కిలోమీటర్ల పొడవున సుందరీకరణ పనులు చేశామని గుర్తు చేశారు. ప్రజల ఆస్తులకు నష్టం చేయకుండా అభివృద్ధి చేయవచ్చని చెప్పడానికి ఇదే నిదర్శనమని అన్నారు.

హైదరాబాద్ నగరంలోని నాగోల్‌లో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ)ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నగరంలో హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని మండిపడ్డారు. పేదల ఇళ్లు కూల్చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.1.50 లక్షల కోట్లతో మూసీ సుందరీకరణ పనులు చేస్తామని ముఖ్యమంత్రి చెబుతున్నారని, కానీ రూ.16 వేల కోట్లతోనే ఆ పనులు చేయవచ్చని అన్నారు.

- Advertisement -

మూసీ సుందరీకరణ పనులను తమకు అప్పగిస్తే రూ.16 వేల కోట్లకే చేసి చూపిస్తామని అన్నారు. పైగా ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా అభివృద్ధి చేస్తామని అన్నారు. హామీల అమలు కోసమే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారని అన్నారు. ఈ రెండున్నరేళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఇంటిని నిర్మించినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News