Sunday, March 1, 2026
HomeతెలంగాణKTR | ఒక రెండేళ్లు ఆగండి చాలు..

KTR | ఒక రెండేళ్లు ఆగండి చాలు..

  • బీ ఆర్ ఎస్ మీకు అండగా ఉంటుంది..
  • భూములు, ఇండ్లు పోకుండా చూస్తాం..

ఒక్క రెండు సంవత్సరాల పాటు మూసీ బాధితులు తమ భూములను, అపార్ట్‌మెంట్లను కాపాడుకునేందుకు ప్రయత్నం చేయాలని, ఈ పోరాటంలో భారత రాష్ట్ర సమితి వారికి అండగా ఉంటుందని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూసీ కోసం ఎవరి భూములు, ఇళ్లు పోకుండా చూస్తామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యం నడుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.

ఒకవైపు దేశంలో బీజేపీ బుల్డోజర్ రాజ్యం చేస్తున్నదని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీతో పాటు మిగిలిన నేతలంతా చెబుతున్నారని తెలిపారు. కానీ తెలంగాణలో జరుగుతున్న ఈ బుల్డోజర్ రాజ్యాన్ని, దాని అరాచకాలను మాత్రం ఆపకుండా మౌనంగా ఉంటున్నారని విమర్శించారు. ఒకవైపు బుల్డోజర్ రాజ్యంపై విమర్శలు చేస్తూ, ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తున్న బుల్డోజర్ అరాచకాలను కేవలం రేవంత్ పంపిస్తున్న సంచుల కట్టల కోసం చూడనట్లు వదిలేస్తున్నారన్నారు.

- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డికి తెలిసిన పాలన కేవలం ఇళ్లను కూలగొట్టడం, భూములు ఆక్రమించడం, రియల్ ఎస్టేట్ దందా చేయడం, దానికోసం పేదల జీవితాలను పూర్తిగా నాశనం చేయడమేనని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ప్రజల ఇళ్లను కూలగొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడమే తన పనిగా పెట్టుకున్నారని కేటీఆర్ అన్నారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఒక్క ప్రాజెక్టు గాని, ఒక్క ఇల్లు గాని, ఒక్క రోడ్డు గాని వేయకుండా కేవలం విధ్వంసమే తన విధానంగా పెట్టుకుని ముందుకు పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌లో మూసీ ప్రాజెక్టులో భాగంగా పెద్ద ఎత్తున తమ ఇళ్లను, భూములను, అపార్ట్‌మెంట్లను కోల్పోతున్న రాజేంద్రనగర్ ప్రాంతంలోని హైదర్ షా కోట్, మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్ బాధితులను కేటీఆర్‌ కలిసి వారికి సంఘీభావం తెలిపారు. మూసీ బాధితుల కోసం వారు నిర్వహించిన ‘మూసీ దండి మార్చ్’ పాదయాత్రలో మూడున్నర కిలోమీటర్ల పాటు అనేకమంది బాధితులను కలుస్తూ కేటీఆర్ ముందుకు సాగారు.

ఆ తర్వాత మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్ దగ్గర జరిగిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఒక్క రెండు సంవత్సరాల పాటు మూసీ బాధితులు తమ భూములను, అపార్ట్‌మెంట్లను కాపాడుకునేందుకు ప్రయత్నం చేయాలని, ఈ పోరాటంలో భారత రాష్ట్ర సమితి వారికి అండగా ఉంటుందని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూసీ కోసం ఎవరి భూములు, ఇళ్లు పోకుండా చూస్తామని కేటీఆర్ భరోసా ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News