Thursday, February 26, 2026
Homeసాహిత్యంKondamallu | ‘కొండమల్లు’ పుస్తకావిష్కరణ

Kondamallu | ‘కొండమల్లు’ పుస్తకావిష్కరణ

చెంచుల(Chenchulu) జీవన ప్రతిబింబమే(Reflection of Life) ‘కొండమల్లు’ అని మాజీ మంత్రి, సిద్దిపేట్ ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) అన్నారు. చెంచుల చరిత్రను వారి మధ్యనే ఆవిష్కరించడం గొప్ప పరిణామమని చెప్పారు. చెంచుల జీవన విధానాలను ప్రతిబింబించేలా కొండమల్లు నవల(Novel)ను వర్ధెల్లి వెంకటేశ్వర్లు తీర్చిదిద్దారని ప్రశించారు. గచ్చిబౌలిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన కొండమల్లు పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘సాధారణంగా నవలలు రాజుల యుద్ధాల గురించి ఉంటాయి. కానీ.. గిరిజనుల సామాజిక జీవన విధానాల నేపథ్యంలో రావడం గొప్ప విషయం’ అని పేర్కొన్నారు. వర్ధెల్లి వెంకటేశ్వర్లు రచించిన మూడు పుస్తకాలను ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నట్లు వెల్లడించారు. కొండమల్లు పుస్తకం ద్వారా చెంచుల చరిత్ర, వారి సంస్కృతి చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయిని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News