Friday, October 3, 2025
ePaper
Homeఆంధ్రప్రదేశ్పేర్ని నానికి కొల్లు రవీంద్ర హెచ్చరిక

పేర్ని నానికి కొల్లు రవీంద్ర హెచ్చరిక

వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్ ఇచ్చారు. పేర్ని నాని పాపం పండిందని, అతణ్ని ఇక వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. గత ప్రభుత్వంలో ఐదేళ్లు ప్రజలను పట్టి పీడించారని, ఇప్పుడు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. 2006లో బందర్ పోర్టును అమ్మేందుకు పేర్ని నాని విఫలయత్నం చేశారని ఆరోపించారు.

ప్రజల పోరాటంతో బందరు పోర్టును సాధించుకున్నామని చెప్పారు. మచిలీపట్నం నియోజకవర్గానికి పట్టిన శని పేర్ని నాని అని కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. సానుభూతి రాజకీయాలకు కాలం చెల్లిందని, తప్పు చేసినవారిని చట్టం వదిలిపెట్టదని హెచ్చరించారు. బురద చల్లే ప్రయత్నం చేయటం సిగ్గుచేటని మండిపడ్డారు. నిన్న పేర్ని నాని మాట్లాడుతూ కొల్లు రవీంద్రను టార్గెట్‌గా చేసుకొని విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. దీనికి కౌంటర్‌గా ఇవాళ కొల్లు రవీంద్ర స్పందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News