బోయినపల్లి మండలం లోని కోదురపాక సర్పంచ్ కత్తెరాపాక మంజుల సుధాకర్ గురువారం ఆడబిడ్డ కి కోదురుపాక సర్పంచ్ భరోసా పథకం ప్రారంభించారు. ఈ పథకం లో భాగంగా 5 వేల రూపాయలను పుట్టిన ఆడబిడ్డ పేర పోస్టాఫీసులో సుకన్య సంవృద్ధి పథకం క్రింద అకౌంట్ తీసి జామచేశారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ, ఎన్నికల ప్రచారం సమయంలో మేము ప్రజలకు ఇచ్చిన హామీ లో భాగంగా నేడు ఈ పథకం ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉన్నది అని అన్నారు. మేము సర్పంచ్ గెలిచినా నుండి మా గ్రామంలో పుట్టే ఆడబిడ్డ కి మేము సుకన్య సంవృద్ధి పథకం పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ తీసి అందులో 5000/- జమ చేయటం జరుగుతుంది. ర్యాకం గౌతమి-తిరుమలేష్ గార్ల కూతురి పైనా ఈ రోజు పథకం మొదలు పెట్టాము.
ఈ అకౌంట్ లో తల్లిదండ్రులు వారికీ వీలును బట్టి డబ్బులు వేసుకుంటూ పోతే, ఉన్నత చదువుల చేసే టైం లో లేదా పెళ్లి చేసే సమయానికి ఆర్థికంగా తోడుగా ఉంటుంది. ఈ కార్యకమంలో వార్డ్ సభ్యులు అన్నాళదాస్ భాస్కర్, బలాగోని శ్రీనివాస్, సమతా, నాగుల లావణ్య, రవివర్మ, గ్రామభివృద్ధి నాయకులు బండి శ్రీను, నాగుల నాగరాజు, వంశీ, అంజయ్య, దేవయ్య, మురళి, సత్యనారాయణ రావు, రవి, కమల్, యువకులు పాల్గొన్నారు.

