Tuesday, March 3, 2026
Homeమెదక్‌Kisan Fashion Mall | కిసాన్ ఫ్యాషన్ మాల్ ప్రారంభం

Kisan Fashion Mall | కిసాన్ ఫ్యాషన్ మాల్ ప్రారంభం

మెదక్ పట్టణం(Medak Town)లో కొత్త కిసాన్ ఫ్యాషన్ మాల్‌ను మెదక్ ఎంపీ (Medak Mp) మాధవనేని రఘునందన్ రావు (Madhavaneni Raghunandan Rao) ప్రారంభించారు. ఈ మాల్‌ను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే (Nizamabad Urban MLA) ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా (Dhanpal Suryanarayana Gupta) ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ (Medak MLA Mynampally Rohit) కూడా పాల్గొన్నారు.

మాల్ ప్రారంభం సందర్భంగా రిబ్బన్ కటింగ్, జ్యోతి ప్రజ్వలన, ప్రత్యేక పూజ నిర్వహించారు. మాల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎంపీ రఘునందన్ రావుకు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే ధన్‌పాల్.. కార్యక్రమం అనంతరం అమ్మవారి విగ్రహాన్ని బహూకరించారు. సూర్యనారాయణ, రఘునందన్ రావు బీజేపీ నాయకులు కాగా రోహిత్ కాంగ్రెస్ నేత.

- Advertisement -
RELATED ARTICLES

Latest News