ఖమ్మం (Khammam) జిల్లా కాంగ్రెస్ కమిటీ (District Congress Committee) అధ్యక్షుడి(President)గా బాధ్యతలు స్వీకరించిన నూతి సత్యనారాయణ గౌడ్(Nuthi Satyanarayana Goud)కి డిప్యూటీ సీఎం (Deputy CM) మల్లు భట్టివిక్రమార్క (Mallu Bhattivikramarka) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. డీసీసీగా విశేష సేవలందించిన పువ్వాళ్ల దుర్గాప్రసాద్ కృషిని మనస్ఫూర్తిగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageshwar Rao), పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖమ్మం పట్టణంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు.
- Advertisement -
