కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలని మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి అన్నారు. బ్రహ్మోత్సవం కోసం అధికారులందరూ సమన్వయం తో పని చేసి భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లో కీసర రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలపై మల్కాజిగిరి జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్, జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, కుషాయిగూడ ఏసీపీ వెంకట్ రెడ్డి, కీసర ఆర్డీవో రాజేష్ కుమార్, ఆలయ కమిటీ చైర్మన్ తటాకం వెంకటేశ్, ఈవో సుధాకర్ రెడ్డి లతో కలిసి కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 15న మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని ఫిబ్రవరి 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు కీసర గుట్టపై శ్రీ రామలింగేశ్వర స్వామి నిర్వహించనున్నట్లు తెలిపారు.
