సబ్ ఇన్స్పెక్టర్‌ని అంటూ బోగారం పెట్రోల్ బంక్ మేనేజర్‌కు కాల్ చేసి కీసర ఇన్స్పెక్టర్‌కు ఆన్లైన్‌లో డబ్బులు కావాలని నగదు బంక్ వద్దకు పంపిస్తా అని చెప్పి సైబర్ మోసగాడు మోసగించిన సంఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గుడ్డిగా నమ్మిన బంక్ మేనేజర్ హనుమంతు వాట్సప్‌లో ప్రొఫైల్ ఫోటో , ట్రుకాలర్‌లో సిఐగా రావడంతో మోసగాడు పంపిన స్కానర్‌కు ఇరవై వేల రూపాయలు బంక్ మేనేజర్ పంపించాడు. చివరకు తాను సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయానని గ్రహించి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
- Advertisement -
