Monday, March 2, 2026
HomeతెలంగాణKCR | ఇవాళ్టి వరకు ఒక కథ.. రేపటి నుంచి మరో కథ: కేసీఆర్

KCR | ఇవాళ్టి వరకు ఒక కథ.. రేపటి నుంచి మరో కథ: కేసీఆర్

బీఆర్ఎస్ పార్టీ అధినేత(BRS Party President), మాజీ సీఎం కేసీఆర్ (Former CM KCR) ఇవాళ మీడియా(Press Meet)తో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాలమూరు(Palamuru), రంగారెడ్డి (Rangareddy) జిల్లాలకు అన్యాయం చేస్తున్నాయని విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌(AndhraPreadesh)లో తెలంగాణ(Telangana)కు తీవ్ర నష్టం జరిగిందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఉద్యమం చేశాకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని తెలిపారు.

కేసీఆర్ ఇంకా ఏమన్నారంటే..

  • పాలమూరులో వందలకొద్ది చెక్‌డ్యామ్‌లు కట్టాం
  • పాలమూరు జిల్లాలో చెరువుల లెక్కలు తీసి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చాం.
  • బీజేపీ ప్రభుత్వం మాకు మొదటి నుంచి శనిలా దాపురించింది.
  • ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ సర్కార్‌కు చంద్రబాబు, నితీష్ అవసరం
  • చంద్రబాబు మాటలు విని పాలమూరు డీపీఆర్‌ను వెనక్కి నెట్టింది.
  • అయినా ఈ ప్రభుత్వ మారుమాట్లాడలేదు.
  • కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లయినా పాలమూరులో తట్టెడు మట్టయినా తీయలే
  • ఎంత దద్దమ్మ ప్రభుత్వమైనా పాత ప్రాజెక్టులను కొనసాగించాలి.
  • పాలమూరులో మేం ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లిచ్చాం.
  • నేను ఉద్యమం మొదలుపెట్టాక తొలిసారి జోగులాంబ గద్వాల పాదయాత్ర చేశాను
  • తెలంగాణ వెనకబడ్డ ప్రాంతం కాదని చెప్పాను
  • తెలంగాణ వెనక్కి నెట్టివేయబడ్డ ప్రాంతం అని ఎన్నో సార్లు వివరించాను
  • పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 80-90 శాతం పూర్తి చేశాం.
  • చంద్రబాబు పెండింగ్ పెట్టిన ప్రాజెక్టులను మేం రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చాం.
  • భూగర్భ జలాల ద్వారా మరో లక్షన్నర ఎకరాలకు నీరు అందింది
  • పట్టిసీమ ద్వారా ఏపీ 80 టీఎంసీల నీటిని వాడుకుంటోంది.
  • జూరాల ప్రాజెక్టు కోసం చంద్రబాబు పరిహార సొమ్ము కట్టలేదు
  • ప్రత్యేక రాష్ట్రం వచ్చాక ప్రాజెక్టులపై పూర్తి అధ్యయనం చేశాం
  • పాలమూరు జిల్లాకు 170 టీఎంసీల నీరు తీసుకెళ్లాలనేది బీఆర్ఎస్ పార్టీ లక్ష్యం
  • రాష్ట్రానికి వచ్చే నీళ్లను కాపాడలేని చేతకాని ప్రభుత్వమిది
  • రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? నిద్రపోతోందా?
  • ప్రభుత్వం నోరు మూసుకొని ఉంటే మేమైనా పూనుకోవాలి కదా?
  • ఈ ప్రభుత్వం తోలు తీస్తాం.
  • భారీ బహిరంగ సభలు పెడుతున్నాం. నేనూ వస్తున్నా.
  • ఇవాళ్టి వరకు ఒక కథ. రేపటి నుంచి మరో కథ.
  • ఎవరి ప్రయోజనాల కోసం ఈ ప్రభుత్వం ఉంది?
  • పాలమూరులో గ్రామగ్రామాన డప్పుకొట్టి ఉద్యమిస్తాం
  • ప్రభుత్వం ఎంతసేపూ భూములు అమ్ముకుందాం అనే యావలోనే ఉంటే ఎట్లా?
  • ఈ ప్రభుత్వానికి కావాల్సినంత సమయం ఇచ్చాం.
  • ఇక, నేనే స్వయంగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నా.
  • తెలంగాణ కోసం ఎందాకైనా పోరాడుతాం.
  • పచ్చి అబద్దాలు చెప్పి ప్రజలను మోసం చేశారు
  • రెండేళ్ల నుంచి మౌనంగా చూస్తున్నా.
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఇక పోరాటమే.
  • మొదటికే ముప్పు వచ్చే పరిస్థితి ఉంది.
  • మేం ఉద్యమించకతప్పదు
  • కళ్ల ముందు మోసం జరుగుతుంటే కేసీఆర్ ఎలా ఊరుకుంటాడు?
  • ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్రకారం 20 శాతం క్రైమ్ రేట్ పెరిగింది.
  • పెళ్లిళ్లు చేసుకోవద్దు. ఆగండి. మేం తులం బంగారం ఇస్తామని చెప్పారు.
  • జంట నగరాల్లో పట్టపగలే హత్యలు జరుగుతున్నాయి. అడిగే దిక్కులేకుండా పోయింది.
  • మాయమాటలతో జనాల్ని మోసం చేస్తున్నారు.
  • పాలమూరుపై కేంద్రాన్ని ఎండగడతాం.
  • ఈ కాంగ్రెస్ ప్రభుత్వం.. సర్వభ్రష్ట ప్రభుత్వం
  • పత్తి, ఒడ్లు కొనే దిక్కులేదు.. ఈ రాష్ట్రంలో..
  • బీఆర్ఎస్ ఉన్నన్ని రోజులు చెప్పుల లైన్లు ఉన్నాయా?
  • ఏ గోదాంలో యూరియా బస్తా ఉందో చెప్పడానికి యాప్ ఎందుకు?
  • ఫ్యూచర్ సిటీ తొక్కలో సిటీ..
  • మీ ఫ్యూచర్ సిటీ ఎవరికి కావాలి?
  • గురుకులాల్లో విద్యార్థులు చనిపోతారా?
  • ఐదారేళ్లు కష్టపడి ఫార్మాసిటీకి భూములు సేకరించాం.
  • కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు తెచ్చుకున్నాం.
  • ఫార్మా సిటీలో ఇప్పుడు జరిగే దందా ఏంది?
  • పెట్టుబడులు వచ్చాయని ఇష్టమొచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారు
  • అన్నీ దిక్కుమాలిన నిర్ణయాలు.. రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందాలు..
  • నిజంగా పెట్టుబడులు వస్తే.. కనపడాలి కదా?
  • ఫార్మా కంపెనీలన్నింటినీ ఒకే చోటకు తెచ్చేందుకు ప్రయత్నించాం.
  • మేం బిజినెస్ మీట్‌లు పెట్టలేదు.. ఇంత డంబాచారం చెప్పలేదు..
  • ఇప్పటివరకు 105 మంది గురుకుల విద్యార్థులు చనిపోయారు
  • కాంగ్రెస్‌వాళ్లు చాంతాడంత.. 420 హామీలు ఇచ్చారు..
  • బెస్ట్ పాలసీలు ఉంటే ఆటోమేటిక్‌గా పెట్టుబడులు వస్తాయి.
  • మహిళలకు ఇస్తామన్న రూ.2500కే దిక్కులేదు
  • ఇక, కోటీశ్వరులను ఎలా చేస్తారు?
  • ఉత్త ప్రచారాలతో ప్రజలను ఎంత కాలం మోసం చేస్తారు?
  • రాష్ట్రంలో ఎకరం కూడా అమ్ముడుపోవటం లేదు.
  • కేసీఆర్ సచ్చిపోవాలని కోరుకుంటున్నారు
  • కేంద్రంలో బీజేపీ సర్కారు ఉండటం తెలంగాణ దరిద్రం
  • ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లా వివక్షకు గురైంది.
  • పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌పై ప్రధానంగా చర్చించాం.
  • కేంద్ర, రాష్ట్రాలు తెలంగాణకు చేస్తున్న ద్రోహంపై చర్చించాం.
  • మహబూబ్‌నగర్‌ జిల్లాలో 308 కి.మీ. మేర కృష్ణా నది పారుతుంది.
  • ఆనాటి ప్రతిపాదిత ప్రాజెక్టుల ప్రకారం 174 TMCల నీళ్లు పాలమూరు జిల్లాకు రావాలి.
  • ప్రతిపాదిత ప్రాజెక్టులు మార్చొద్దని SRC స్పష్టంగా చెప్పింది.
  • పాలమూరు ఎత్తిపోతలు కొత్త ప్రాజెక్ట్‌ కాదు.
  • గతంలోనే నీటి కేటాయింపులు జరిగాయి.
  • బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ను కలిసి చాలా సార్లు విజ్ఞప్తి చేశాం.
  • ఈ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైందని బచావత్‌ ట్రిబ్యునల్‌ ప్రకటించింది.
  • సమైక్య పాలకులు కేటాయించకున్నా సుమోటోగా జూరాల ప్రాజెక్టుకు బచావత్‌ నీళ్లు కేటాయించారు
  • గతంలో చంద్రబాబు మహబూబ్‌నగర్‌ జిల్లాను దత్తత తీసుకున్నారు.
  • ఇష్టమొచ్చినట్లు పునాదిరాళ్లు కూడా వేశారు.
  • తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని చెప్పేందుకు జోగులాంబ నుంచి గద్వాల వరకు పాదయాత్ర చేశా.
  • కృష్ణా నది పారే జిల్లాలో గంజి కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన దుస్థితి ఉండేది.
  • సమైక్య రాష్ట్రంలో చాలా వెనకబడిన జిల్లా పాలమూరు జిల్లా
  • ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు తీవ్ర అన్యాయం చేశాయి
  • గతంలో 174 టీఎంసీల కేటాయింపు పాలమూరుకు ఉండేది
  • మేము బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్ ముందు కూడా వాదించాం. అనేక రూపాల్లో ప్రచారం చేశాం.
  • బచావత్ ట్రిబ్యూనల్‌లో స్వయంగా పాలమూరు వెనకబాటును గుర్తించారు.
  • న్యాయమూర్తిగా కరువు చూడలేక జూరాల కోసం 17 టీఎంసీలు కేటాయించారు.
  • అంజయ్య సీఎంగా శంకుస్థాపన చేశారు జూరాల కోసం.
  • 2001లో టీఆర్ఎస్ పార్టీ పుట్టేదాకా ఇదే తంతు.
  • చంద్రబాబు మహబూబ్‌నగర్ జిల్లాను దత్తత తీసుకున్నారు.
  • అనేక ప్రాజెక్టులకు బాబు శంఖుస్థాపన చేశారు.
  • తెలంగాణ ఉద్యమ సమయంలో కవులు పాలమూరు కరువుపై అనేక పాటలు రాశారు
  • నేను జోగులాంబ టు గద్వాల పాదయాత్ర కూడా చేశాను
  • ఆర్డీఎస్‌పై సమైక్య రాష్ట్రంలో బాంబులేసి పేల్చారు.
  • తెలంగాణ వెనక బడ్డ ప్రాంతం కాదు. వెనక పడేయబడ్డ ప్రాతం అని అనేక సార్లు చెప్పాను.
  • కృష్ణా నది 300 కిలోమీటర్లు పారే పాలమూరు జిల్లాలో గంజి కేంద్రాలు పెట్టారు
  • సమైక్య రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులు చేశాం
  • 6 లక్షల 50 వేల ఎకరాలను సాగులోకి తెచ్చాం
  • గతంలో 30 వేల ఎకరాలు కూడా సాగులో లేవు
  • మిషన్ కాకతీయలో 1 లక్షా 50 వేలు సాగులోకి వచ్చింది
  • అనేక చెక్ డ్యాములు కట్టాం
  • నల్గొండ పాలమూరు రంగారెడ్డి వంద శాతం కృష్ణా బేసిన్‌లో ఉన్నాయి.
  • వీటి కోసం పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించారు
  • ఈ జిల్లా ప్రాజెక్టుల కోసం 170 TMC పెట్టాం
  • 90.81 TMCలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం పెట్టాం
  • పట్టిసీమతో వచ్చిన 45 TMC మైనర్ ఇరిగేషన్ 45 TMC కలిపి పెట్టాం.
  • పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం 37 వేల కోట్లు పెట్టి 25 వేల కోట్లు ఖర్చుచేశాం
  • పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్‌లో 145 MW సామర్థ్యం గల పంపులు పెట్టాం
  • రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం
  • ఇంత దద్దమ్మ ప్రభుత్వం నేను ఎన్నడూ చూడలేదు
  • ఇంతవరకు తట్టెడు మట్టి తీయలేదు
  • కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి తెలంగాణకు శనిలా ఉంది
  • చంద్రబాబు మాటలు నమ్మి ఇబ్బంది పెట్టారు
  • పాలమూరు రంగారెడ్డి DPRని కేంద్రం వెనక్కి పంపింది.
  • అయినా.. రాష్ట్ర ప్రభుత్వం సప్పుడు లేదు
  • మా ప్రభుత్వంలో వడ్లు కొనకపోతే ఢిల్లీలో ధర్నా చేశాం
  • కొత్తం రాష్ట్రం ఏర్పడితే SRC ప్రకారం పరిష్కరించాలి
  • మేం సుప్రీంకోర్టుకు వెళ్లాక కేసు విరమించున్నాక బ్రిజేష్ ట్రిబ్యూనల్ వేశారు
  • పాలమురు ప్రాజెక్టుతో ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలు పారుతుంది
  • రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత దద్దమ్మతనం ఎందుకు
  • పెద్దఎత్తున గొడవ చేయాలి కదా
  • రాష్ట్ర మంత్రి 45 TMC చాలని లెటర్ ఎలా రాస్తారు. ఇదో ప్రభుత్వమా.
  • ఎంతసేపు సీఎం, మంత్రులకు రియల్ ఎస్టేట్ బిజినెస్, అక్రమ వసూళ్లు, కమీషన్లు తప్ప పైసా అభివృద్ధి జరిగిందా
  • అభివృద్ధికి ఎవరు అడ్డుపడుతున్నారు? కుట్రలు ఎవరివి?
  • రాష్ట్ర ప్రభుత్వ తీరుపై పెద్దఎత్తున ప్రజాఉద్యమం చేస్తాం
  • ప్రజల్లో చైతన్యం వచ్చేలా భారీ బహిరంగ సభలు నిర్వహిస్తాం.
  • తెలంగాణ వాయిస్ ఏదీ ప్రభుత్వంలో
  • కారుకూతలు కూస్తే ఊరుకోం…తోలు తీస్తాం, ఇంత వరకు ఆగాం, ఇక ఊరుకోం
  • తెలంగాణ మొదటికే ముప్పు వచ్చింది
  • చంద్రబాబు గోదావరిలో నల్లమల్ల సాగర్ దోపిడీ చేస్తున్నారు
  • గ్రామగ్రామాన సభలు పెడతాం
  • కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడుతాం.
  • రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతకైనా పోరాడుతాం
  • ఆల్తుఫాల్తూ మాటలు కాదు.
  • సర్వభ్రష్ట్ర ప్రభుత్వం ఇది.
  • సంక్షేమ, అభివృద్ధి పారిశ్రామికీకరణ. మంచి సర్కార్ ఉండే మా హయాంలో.
  • తెలంగాణలో 20% క్రైమ్ పెరిగింది
  • దొంగ మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది
  • అర్రస్ పాట పాడినట్టు అన్నీ ఇచ్చారు.
  • ఓవర్‌సీస్ స్కీంలో 20 లక్షలు ఇస్తామన్నారు
  • మొత్తం శఠగోపం పెట్టారు..
  • ఇప్పుడు వడ్లు కొంటలేరు..
  • అన్నింటికి రూ 500 బోనస్ ఇస్తామన్నారు…
  • రైతులు యూరియా కోసం లైన్లు కట్టాల్సి వచ్చింది…
  • యూరియా కోసం యాప్ తెచ్చారు..
  • రైతులను ఇబ్బంది పెడుతున్నారు…
  • మాది రైతు సెంట్రిక్ సర్కార్ ఉండే..
  • నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు…
  • కాంగ్రెస్ హామీలకు జనం టెమ్ట్ అయి ఓటేశారు…
- Advertisement -
RELATED ARTICLES

Latest News