తొడలు గొట్టేదొక్కళ్లు.. తొండలు ఇడిసేది
ఇంకొక్కరు.. ఏమయ్యా కేసీఆర్..ఏదో చెప్తివి..
ఏదో చేస్తివి ..గిట్ల అస్తివి.. గట్ల పోతివి..
మీ లీడర్లేమో మా కేసీఆర్ వస్తుండు..
అపోజిషన్ పార్టీ వాళ్లను ఒక ఆట
ఆడుకుంటాడని కలలు కంటే, ఆ కలలన్నీ కల్లలు
జేస్తివి.. మరి ఇప్పుడున్న సీఎం రేవంతేమో
చేతిలో చెయ్యేసి పాయె.. నీకు ఉన్న జ్ఞానం
నీ కొడుకుకు లేకపాయే.. సీటుకే అతుక్కుపాయే..
సభ మర్యాద కూడా తెలవకపోయే..
గిట్ల అయితే ఎట్లనే బాపు!..
నిన్ను నమ్ముకున్న ఎమ్మెల్యేలు,
క్యాడర్లంతా కూడా ఇబ్బంది వడవట్టే..
కేసీఆర్.. మీ క్యాడర్కు ఉత్సాహం తెప్పియ్యే జెరా..
ఇయ్యాల్నైనా వస్తవా మరి..
- అందె శ్రీధర్
- Advertisement -
