తెలంగాణ పంచాయత్ రాజ్ శాఖ ఆధ్వర్యం లో మార్చి 11,12 తేధిలలో రెండు రోజులు దేశ రాజధాని ఢిల్లీలో జరుగబోతున్న అంతర్జాతీయ మహిళాదినోత్సవ సదస్సుకి మన రాష్ట్రం నుండి 15 మంది సబ్యులు ఎన్నికయ్యారు. రంగారెడ్డి జిల్లా నుండి ఏకైక సర్పంచ్ గా ఎన్నుకోబడిన అబ్దుల్లాపూర్ మెట్టు మండలం, కవాడిపల్లి సర్పంచ్ కొలను ప్రసన్న లక్ష్మి. గ్రామ అభివృద్దికి ఆమె చేసిన కృషికి గాను ఈ గౌరవం లభించింది. ఈ కార్యక్రమములో భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము మహిళా సాధికారత, సమాన హక్కులపై ప్రసంగం ఉందని తేలియజేసారు. శుభాకాంక్షలు తెలియజేసినా గ్రామప్రజలు, శ్రేయోభిలాషులు.

- Advertisement -
