నిజామాబాద్‌లో గంజాయి ముఠా దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఎక్సైజ్ కానిస్టేబుల్(Excise Constable) సౌమ్యను, ఆమె కుటుంబ సభ్యులను హైదరాబాద్‌లోని నిమ్స్ హాస్పిటల్‌లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు(Telangana Jagruti President) కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ.. ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్‌ను చంపే ధైర్యం గంజాయి బ్యాచ్(Cannabis batch) చేయడాన్నిబట్టి చూస్తే ప్రభుత్వమంటే వారికి ఏ మాత్రం భయం లేదని స్పష్టమవుతున్నట్లు చెప్పారు.
‘డ్రగ్స్, గంజాయి ఫ్రీ చేస్తామని ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ.. గ్రామాల్లో కూడా ఫ్రీగా గంజాయి, డ్రగ్స్ దొరికే పరిస్థితి వచ్చింది. స్కూల్‌లోకి కూడా గంజాయి, డ్రగ్స్ తీసుకొచ్చి పిల్లలను పాడుచేస్తున్నారు. ఈ కారణంగా మా ఆడవాళ్లే బాధితులుగా మారే పరిస్థితి నెలకొంది. గృహ హింస ఘటనలు జరగటానికి డ్రగ్స్, గంజాయి కారణమవుతోంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మత్తు వదిలి డ్రగ్స్, గంజాయి మాఫియాపై ప్రతాపం చూపాలి. ఎక్సైజ్, ఫారెస్ట్ సిబ్బందికి ఆయుధాలు ఇవ్వాలి. వాళ్లకు ట్రైనింగ్‌లో గన్ ఫైరింగ్ ఉంటుంది. కానీ.. వెపన్స్ ఇవ్వటం లేదు. వారి వద్ద వెపన్స్ ఉంటే గంజాయి, డ్రగ్స్ మాఫియాకు కాస్త భయం ఉంటుంది’ అని అన్నారు.
