తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు (Telangana Jagruti President) కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha)కు ఆ సంస్థ నేతలు ఘన స్వాగతం (Grand Welcome) పలికారు. జాగృతి శ్రేణులు, మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి మంగళ హారతులు పట్టారు. ‘జనం బాట’ (Janam Baata) కార్యక్రమంలో కవిత మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా(Mahabubnagar District)లోని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన ఉద్దండాపూర్ రిజర్వాయర్‌ను సందర్శించారు. అక్కడికి వెళ్తున్న సందర్భంలో హైదరాబాద్-బెంగుళూరు జాతీయ రహదారిలోని షాద్‌నగర్ (Shad Nagar) వద్ద జాగృతి నేతలు కవితను కలిశారు.
రంగారెడ్డి జిల్లా జాగృతి నియోజకవర్గ ఇంచార్జ్ సీమల రమేశ్ కురుమ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోళ శ్రీనివాస్, మైనారిటీ రాష్ట్ర అధ్యక్షుడు ముస్తఫా, రాష్ట్ర బిసి విభాగం ప్రధాన కార్యధర్శి రాంకోటి, రాష్ట్ర యంబిసి అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ, అందుగుల సత్యనారాయణ, ఉదయభాను, షాద్‌నగర్ పట్టణ అధ్యక్షుడు మహేష్, కేశంపేట్ మండల అధ్యక్షుడు వెంకటయ్య, కొత్తూరు కుమార్ మండల అధ్యక్షుడు వీరయ్య, చౌదర్‌పల్లి మండల అధ్యక్షుడు అంజి కురమ, ఫరూక్ నగర్ మండల అధ్యక్షుడు మల్లేశ్, నరేందర్ గోపు వర్ష తదితరులు కవితకు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక గెలుపోఓటముల వల్ల ప్రజలకు ఒరిగేదేమిలేదని చెప్పారు. తెలంగాణ జాగృతి.. ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి యాత్ర ప్రారంభించినట్లు ఆమె తెలిపారు.
