Tuesday, March 3, 2026
Homeకరీంనగర్Karimnagar | ముత్తునూరి హరీష్ కు మేయర్ పరామర్శ.

Karimnagar | ముత్తునూరి హరీష్ కు మేయర్ పరామర్శ.

కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ కొలగాని శ్రీనివాస్ బీజేపీ కొత్తపల్లి జోన్ అధ్యక్షులు ముత్తునూరి హరీష్ ను పరామర్శించారు. ముత్తునూరి హరీష్ ఇటీవల జరిగిన ప్రమాదంలో కాలు కు గాయం అయిన విషయం తెలుసుకున్న మేయర్ కొలగాని శ్రీనివాస్ కొత్తపల్లి లోని హరీష్ నివాసానికి విచ్చేసి ఆయన్ని పరామర్శించారు.

ప్రమాదం జరిగిన విషయాలు తెలుసుకొని హరీష్ తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. హరీష్ నివాసానికి వచ్చిన బిజెపి నాయకులు కార్యకర్తలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు కేంచ శేఖర్, జిల్లా నాయకులు ఎర్రోళ్ల ప్రదీప్, ప్రధాన కార్యదర్శి కొప్పుల హరిప్రసాద్, గొపు మునీదర్ రెడ్డి మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News