విద్యార్థులకు ప్రాథమిక దశ నుండే పలు వైజ్ఞానిక ప్రదర్శనలకు ప్రోత్సాహం అందించాలని, వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయటానికి పలు ప్రదర్శనలు వేదికగా మలుచుకోవాలని తద్వారా వారు రూపొందించిన నమూనాలు ప్రదర్శించవచ్చని కరీంనగర్ జిల్లా విద్యాధికారి శ్రీరాం మొడయ్య, అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి , జిల్లా సైన్స్ అధికారి జయపాల్ రెడ్డి ఇతర అధికారులతో కలిసి స్థానిక కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో నిర్వహించిన, వైజ్ఞానిక ప్రదర్శన సన్నాహక సమావేశానికి హాజరై మాట్లాడారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా సృజనాత్మకతకు మారుపేరని, విద్యార్థుల ప్రతిభకు పట్టం కట్టేటువంటి గొప్ప జిల్లా అని ప్రతి సంవత్సరం కరీంనగర్ జిల్లా నుండి జపాన్ వెళ్లడానికి ఎంపిక అవుతున్నారని హర్షం వ్యక్తం చేస్తూ ఈ సంవత్సరం కూడా జిల్లా కలెక్టర్ పమేల సత్పతి మార్గదర్శకమున జిల్లా స్థాయి బాల వైజ్ఞానికప్రదర్శన 2025 -26 సంవత్సరానికి, జిల్లా స్థాయి ఇన్స్పైర్ అవార్డ్స్ ప్రదర్శన 2024 25 సంవత్సరానికి ఘనంగా నిర్వహించడానికి అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలను వేదికగా ఎంపిక చేసామని, అన్ని వసతులతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరం కూడా కృషి చేయాలని వారు చెప్పారు.
ఈ ప్రదర్శనకు మొత్తం 717 నమూనాలు నమోదు చేయడం జరిగిందని, ఇందులో నుండి 7 జూనియర్ & 7 సీనియర్ రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయడం జరుగుతుందని, ఇన్స్పైర్ అవార్డ్స్ ప్రదర్శనకు 126 నమూనాలు నమోదు చేయబడినయని ఇందులో నుండి 13 నమూనాలను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయడం జరుగుతుందని వారు చెప్పారు. ప్రదర్శనకు వివిధ పాఠశాలల యజమాన్యాలు, ఉపాధ్యాయులు అందరు కూడా సహకరించి చక్కటి సమన్వయంతో విజయవంతం చేయాలని కోరారు.విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి మాట్లాడుతూ చాలా చక్కటి అవకాశం విశ్వాసంతో విద్యాసంస్థలకు ఇచ్చినందుకు జిల్లా పరిపాలనిధికారి పమేలా సత్పతి, ధన్యవాదాలు తెలియజేశారు.
అల్ఫోర్స్ విద్యాసంస్థల పక్షాన పాఠశాలను వేదికగా ఇవ్వడం జరిగిందని ఈ వేదికగా విద్యార్థులకు మధ్యాహ్నం భోజన వసతి కల్పించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారి యొక్క ప్రతిభను చాటాలని సూచించారు. విద్యార్థులకు అన్ని విధాలుగా విద్యాసంస్థల వారి తరఫున చేయుత అందిస్తామని వారికి ఎటువంటి లోటు రాకుండా చక్కటి ప్రదర్శనకు గొప్ప వేదిక అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మెయిన్ థీమ్
అభివృద్ధి చెందిన భారతదేశం, స్వయం సమృద్ధి భారతదేశం
సబ్ థీమ్స్
- సుస్థిర వ్యవసాయం
- వ్యర్ధ పదార్థాల నిర్వహణ, ప్రత్యామ్నాయ మొక్కలు
- హరిత శక్తి
- అభివృద్ధి చెందుతున్న సాంకేతికత
- వినోదపరితమైన గణిత నమోనాలు
- ఆరోగ్యం, పరిశుభ్రత
మూడు రోజు ల ప్రదర్శన ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి కట్ట ఆనందం గారు, డిసీఇబీ కార్యదర్శి భగవంత రావు గారు, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా అటల్ టింకరింగ్ ల్యాబ్స్ సమన్వయకర్త అనంత చార్య మిల్కూరి శ్రీనివాస్ జిల్లా ప్రణాళిక సమన్వయకర్త, పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
