- సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి,కాంగ్రెస్ కార్పోరేషన్ అధ్యక్షుడు అంజన్ కుమార్ అరెస్ట్
నేషనల్ హెరాల్డ్ కేసులో బీజేపీ రాజకీయ కక్షతో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ వేధింపులను ఖండిస్తూ ఏఐసీసీ, టీపీసీసీ పిలుపుమేరకు కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నిరసన ర్యాలీ నిర్వహించింది.అంబేద్కర్ చౌరస్తా (కోర్టు) నుండి బయలుదేరిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీలో పాల్గొన్న సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తోపాటు కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ ను ఇతర నాయకులను అరెస్టు చేసి బైపాస్ లోని సిటిసి కి తరలించారు.
ఈ సందర్భంగా సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ నేషనల్ హెరాల్డ్ పత్రిక కు సంబంధించి ఎటువంటి మనీ లాండరింగ్ జరుగకున్నా ఈడి విచారణ పేరుతో సోనియా గాంధీ ని రాహుల్ గాంధీ ని వేధింపులకు గురిచేయడం దారుణమని ఢిల్లీ కోర్టు స్పష్టమైన తీర్పు ద్వారా బీజేపీ కి చెంపదెబ్బ కొట్టినట్టయిందని అన్నారు.అరెస్టయిన నాయకులను స్వంత పూచికత్తుపై వదిలిపెట్టారు.
