Wednesday, October 1, 2025
ePaper
Homeకెరీర్ న్యూస్దరఖాస్తులకు ఆహ్వానం

దరఖాస్తులకు ఆహ్వానం

  • ప్రైవేటు, మైనారిటీ మెడికల్ కళాశాలల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల
  • ఆగస్టు 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు

తెలంగాణలోని ప్రైవేటు, అన్‌ఎయిడెడ్, మైనారిటీ మెడికల్ మరియు డెంటల్ కళాశాలల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్ కోర్సుల్లో యాజమాన్య కోటా కింద ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసింది. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం విడుదల చేసిన ప్రకటనలో, కేటగిరీ-బి (మ్యానేజ్‌మెంట్ కోటా), కేటగిరీ-సి (ఎన్‌ఆర్‌ఐ కోటా) కింద అర్హత కలిగిన అభ్యర్థులు ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమై ఉన్నదీ, అభ్యర్థులు ఆగస్టు 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చని విశ్వవిద్యాలయం స్పష్టం చేసింది.

దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో జరగనుంది. అభ్యర్థులు tspvtmedadm.tsche.in వెబ్‌సైట్‌ను సందర్శించి అవసరమైన దస్త్రాలు అప్‌లోడ్ చేసి, దరఖాస్తు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో భాగంగా దరఖాస్తుదారుల విద్యార్హతలు, నెట్‌ మార్కులు, సంబంధిత డాక్యుమెంట్లు, ప్రవేశానికి కావలసిన ప్రమాణాలు వివరంగా పరిశీలించబడతాయి. ప్రవేశాలకు సంబంధించిన కాలేజీల జాబితా, ఫీజు వివరాలు, సీట్ల వివరాలను కూడా అదే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు విశ్వవిద్యాలయం పేర్కొంది. అభ్యర్థులు నిబంధనలు, అర్హత ప్రమాణాలను జాగ్రత్తగా పరిశీలించి, చివరి తేదీకి ముందే దరఖాస్తు పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News