Wednesday, February 11, 2026
Homeవరంగల్‌Development | అభివృద్ధిని చూసి ఓటు వేయండి…!

Development | అభివృద్ధిని చూసి ఓటు వేయండి…!

  • మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సర్పంచ్ అభ్యర్ధి చిన్నపాక శ్రీనివాస్ పిలుపు
  • సర్పంచ్ అభ్యర్ధికి మద్దతుగా డప్పు చప్పుళ్ళతో, కోలాటాలతో భారీ ర్యాలీ…
  • పాల్గొన్న మాజీ మంత్రి, గ్రామంలోని మద్దతుదారులు, యువత

పర్వతగిరి మండల పరిధిలోని కల్లెడ గ్రామంలో చేసిన అభివృద్ధి పనులను చూసి ఓటు వేయాలని సర్పంచ్ అభ్యర్థి చిన్నపాక శ్రీనివాస్, రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్థానిక ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అంతకుముందు టిఆర్ఎస్ గ్రామ, మండల పార్టీ ఆధ్వర్యంలో కల్లెడ గ్రామ చివర ఉన్న డి.సి.సి.బి బ్యాంకు నుండి గ్రామ చౌరస్తా వరకు డప్పు చెప్పుళ్లతో కోలాటం టీం వారిచే ‘ఉంగరం’ గుర్తుకే మన ఓటు అంటూ భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించగా! ఈ ర్యాలీలో స్థానిక మహిళలు యువతీ యువకులు స్వచ్ఛందంగా భారీ ఎత్తున పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వము 420 హామీలు ఇచ్చి ఒకటి కూడా అమలు చేయకుండా ప్రజల్ని మభ్యపెడుతున్నారని తెలిపారు. కల్లెడ గ్రామంలో టిడిపి, టిఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి పనులే కనిపిస్తున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చి రెండు సంవత్సరాలు అయినా కానీ ఇంతవరకు గ్రామంలో ఏమైనా పనులు జరిగాయని ప్రజల్ని ప్రశ్నించారు. అందుకనే టిఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్న గ్రామ సర్పంచ్ అభ్యర్థి చిన్నపాక శ్రీనివాసును భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి ఓటర్లను కోరారు.

- Advertisement -

ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి, మాజీ సర్పంచ్ చిన్నపాక శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామంలో గతంలో ఏ సర్పంచ్ చేయని విధంగా 2013 నుండి 2018 వరకు తను సర్పంచ్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన కాలంలో పలు అభివృద్ధి పనులు చేశానని ప్రధానంగా గ్రామంలో సిసి రోడ్లు, మంచినీటి సౌకర్యము, స్మశాన వాటిక, బతుకమ్మ తల్లి విగ్రహము, కమిటీ హాళ్ళనిర్మాణం తదితర అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, ప్రతి పండక్కి మహిళల కళ్ళల్లో ఆనందం చూడడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పుకొచ్చారు. తన పదవీకాలం అనంతరం ఐదు సంవత్సరాల కాలంలో వచ్చిన సర్పంచ్ ఏం చేశారో ఒకసారి ఓటర్లు గుర్తు చేసుకోవాలని కోరారు.

ఈ కాలంలోనే తనకు ఉపసర్పంచ్ అవకాశం ఇస్తామని, తన భార్య సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నుండి విరమించుకోవాలని, అన్ని పనులు అయిపోయిన తర్వాత మోసం చేసిన విషయాన్ని ఓటర్లు గమనించాలని కోరారు. నాటి అదృశ్య శక్తే (పెద్ద పిచ్చోడని ప్రజలు గుసగుసలాడుతున్నారు) నేడు ప్రత్యేక వార్డు సభ్యులను బరిలో నిలిపారని, గ్రామంలో నా వెంట ఎవరూ రాకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రజలు గమనించి, ఈ ఐదు సంవత్సరాల కాలం ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని ఏడుస్తూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎండి ముస్తఫా, యువతీ యువకులు గ్రామస్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News