Friday, February 27, 2026
Homeఖమ్మంSafety | విద్యార్థినులు అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

Safety | విద్యార్థినులు అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

  • ఇల్లందు జడ్జి కీర్తి చంద్రిక రెడ్డి

విద్యార్థినులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జడ్జి కీర్తి చంద్రిక రెడ్డి గారు తెలిపారు. శనివారం జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా పట్టణంలోని ఎస్టీ ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ప్రలోభాలకు గురి చేస్తే వెంటనే తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు. బాలికలు ఉన్నత చదువులు చదువుకొని ఉపాధి పొంది ఉన్న ఊరికి కన్నా తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని సూచించారు. బాలికల పై లైంగిక వేధింపులకు పాల్పడే వారికి చట్టపరంగా కఠిన శిక్షలు పడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు ఉమామహేశ్వరరావు, వీరేందర్ రావు హెచ్ఎం సుజాత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News